Home Uncategorized మనువాదుల కబంధహస్తాల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : వడ్డే శోభనాధ్రీశ్వరరావు

మనువాదుల కబంధహస్తాల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : వడ్డే శోభనాధ్రీశ్వరరావు

భారత రాజ్యాంగాన్ని మనువాదం నుండి కాపాడుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు శుక్రవారం విజయవాడలో మీసాల రాజారావు వంతెన నుండి ట్రాక్టర్ బైక్ ఆటో ర్యాలీ పడవల రేవు వరకు వందలాది బైకులు ఆటోలతో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ సిఐటియు ఎన్ టి ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సిహెచ్ శ్రీనివాస్ చేయించారు.
అనంతరం శ్రీనివాస్ ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి యలమందరావు అధ్యక్షతన జరిగిన సభలో శోభనాధ్రీశ్వరరావు మాట్లాడుతూ
…కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల భారత ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రాధమిక హక్కు లను కాలరాస్తున్నదన్నారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని మతపూరితం చేస్తున్నదని మండిపడ్డారు.

రాముడు అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేందుకు చూస్తున్నారన్నారు. రైతాంగానికి ముద్దతు ధర చట్టం చేస్తామన్న హామీ ఉల్లంఘించి మోసం చేశారని తెలిపారు.ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ… మోడీ రాజ్యాంగాన్ని మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో పౌరులు హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నదని… ప్రభుత్వ రంగాన్ని కాపాడుకొనేందుకు బిజెపీ ని ఓడించాలని పిలుపు ఇచ్చారు.సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరావు మాట్లాడుతూ… దేశంలోని అన్ని వ్యవస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.రైతాంగాన్ని ఆత్మహత్య లో పాలు చేస్తున్నదని,కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు మోడీ నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని మోడీ ప్రజల హక్కులను నాశనం చేస్తున్నదని మోడీ ని సాగనంపాలన్నారు. భారతదేశాన్ని మత రాజ్యం గా మార్చేందుకు బిజెపీ తీవ్రంగా యత్నిస్తున్నదన్నారు.మత సామరస్యం కోసం రైతాంగం కార్మికులు 144 కోట్ల ప్రజలు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 16 న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా బంద్ కి పిలుపు ఇచ్చాయని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ రైతులకు పంటలకు మద్దతు ధరలు చట్టం చేసి అమలు చేయాలని,విద్యుత్ తో సహా అన్ని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయరాదని అన్నారు.లఖీంపూర్ లో రైతులను జీపుతో త్రొక్కించి చంపిన కేంద్ర వ్యవసాయ మంత్రి కొడుకు ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రి ని భర్తరఫ్ చేయాలన్నారు.ఈ ర్యాలీ లో పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబూరావు,గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి యం.హరిబాబు, ఐఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి, భారత్ బచావో రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ భాస్కరరావు, ఎఐసిటియు నాయకులు కిషోర్, కెవీపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, కౌలు రైతుల సంఘం ఎన్ టి ఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ సైదులు, సిఐటియు జిల్లా నాయకులు కె.దుర్గారావు,ఈ.వీ.నారాయణ,యం.శ్రీనివాస్, ఎన్ సిహెచ్ సుప్రజ, ఏ.కమల, బోయి సత్యబాబు, వి.బీ.రాజు, యం.శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య,నగర్ ప్రధాన కార్యదర్శి యం.సాంబయ్య, విశ్రాంత ఐఎఎస్ అధికారి శ్రీనివాసరావు, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు .

Exit mobile version