Home Uncategorized పదవులకు ఆశపడి ….పెదవులు మూసుకున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

పదవులకు ఆశపడి ….పెదవులు మూసుకున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీరు తరలించాలి అని నిర్ణయం తీసుకున్నపుడు రాష్ట్రంలో నాయుని నర్సింహ రెడ్డి మంత్రి..కేంద్రంలో కేసీఆర్ మంత్రి గా ఉన్నారు. మంత్రి పదవులకు ఆశపడి, పెదవులు మూసుకొని రాజశేఖర్ రెడ్డి దగ్గర లొంగిపోయి….తొత్తులుగా ఉంది కేసీఆర్ కాదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు వలన తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఆనాడు గోంతెత్తింది పి.జనార్దన్ రెడ్డి …మర్రి శశిధర్ రెడ్డి మాత్రమే అని వెల్లడించారు. కృష్ణ ,గోదావరి నదుల మీద ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేసిన విషయాల మీద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడుతూ….జనార్దన్ రెడ్డి.మర్రి శశిధర్ రెడ్డి అభ్యంతరం పెట్టిన రోజు.. వారికి అండగా నిలబడకుండా… రాజశేఖర్ రెడ్డి కి అండగా నిలబడి పదవులు కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టింది కేసీఆర్ అని మండిపడ్డారు. కృష్ణా ,గోదావరి నదుల మీద ప్రాజెక్టుల విషయం పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ఐటి మంత్రి రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి… కాంగ్రెస్ మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి గురి చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 89 వరకు కృష్ణ,గోదావరి నదుల మీద ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వనికి స్వాధీన పరచటానికి అవసరమైన విధి విధానాలన్నీ ఈ సెక్షన్ లో స్పష్టంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు ను అన్నిటీని కూడా కేంద్ర ప్రభుత్వంకు స్వాధీన చేయటం కూడా … ఈ ప్రోజెక్ట్ ల నిర్వహణ కోసం…నిర్మాణం కోసం దీనిలో మినిష్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ గా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులు గా ఉంటారు.దిని విధి విధానాలను ఖరారు చేస్తూ ఫిబ్రవరి 2. 2014 న పార్లమెంట్ లో ఆమోదం పొందింది..ఆ రోజు కేసీఆర్ పార్లమెంట్ లో సభ్యుడు కాదా అని ప్రశ్నించారు.2014 రాష్ట్ర పునర్విభజన చట్టం రూపోందే సమయంలో కేసీఆర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనలు..సలహాలు మేరకు నిర్ణయం తీసుకుంది.

బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టి ఎం సి ల నీటిని కేటాయించింది.ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా రెండు ప్రభుత్వాలు గా ఏర్పడిన తరువాత 811 టి ఎం సి ల నీటిని విధంగా వినియోగించుకోవాలి,పంపకాలు ఏ విధముగ జరగాలి అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కృష్ణ రివర్ బోర్డ్ సమావేశాన్ని 2015 జూన్ 18,19 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించింది.ఆ సమావేశానికి కేసీఆర్..హరీష్ రావు. కేసీఆర్. జలవివాదాల సలహా సభ్యుడు.విద్య సాగర్ అందరూ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొని 512 టీంఎం సిలు ఏపికి ..299 టీంసిలు తెలంగాణ రాష్ట్రము వాడుకొనే విధంగా ఒప్పందం కుదిరింది.
కృష్ణ నది పరివాహక ప్రాంతం 68 శాతం తెలంగాణ లో ఉంది…32 శాతం మాత్రమే ఆంధ్ర లో ఉంది..అంతర్జాతీయ నీటి వినియోగం విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంత అయితే ఆ రాష్ట్రంలో ఉంటుందో ..ఆ మేరకు అంత శాతం నీటి వాటా ఇవ్వాలని అంతర్జాతీయ విధి విధానాలు చెప్తున్నాయి అని పేర్కొన్నారు.
811 లో 68 శాతం తెలంగాణకు తీసుకుంటే ….500 టీఎంసిలకు పైగా చిలుకు తెలంగాణకు రావాల్సి ఉండేది…299 పైగా టీం ఎం సి లు ఆంధ్రప్రదేశ్ హక్కు గా ఉండేది.కృష్ణ బోర్డ్ సమావేశంలో ఆనాడు అన్ని విషయాల్లో అంగీకారం కుదుర్చుకొని నేడు కాంగ్రెస్ పార్టీ పై బురధచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ కు రావాల్సిన నీటి హక్కులను దారా దత్తం చేసినా దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కృష్ణ రివర్ బోర్డ్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా 15 ప్రాజెక్టులను బోర్డ్ కు అప్పగిస్తున్నదని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బోర్డ్ ముందు 15 ప్రాజెక్టులను అభ్యంతరం వ్యక్తం చేయకుండా ..ఒప్పందాలు మీద సంతకాలు పెట్టారన్నారు.ఈనాడు అదే పోతిరెడ్డిపాడు కు 44,000 క్యూసెక్కులను 80000 క్యూసెక్కులుగా పెంచటానికి జగన్మోహన్ రెడ్డి పెంచటానికి ప్రయత్నం చేస్తున్నారు.దీనితో తెలంగాణను పూర్తి ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.


రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని లిఫ్ట్ ల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే …ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి… కుండా కి పక్క నుంచి బొక్క లెట్టలే…కుండ కింద నుంచి బొక్క పెట్టారు. జనవరి 14 2020 నాడు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన జగన్మోహన్ రెడ్డి… కృష్ణ నది జలాల మీద సమీక్షలు చేసి….జీవో నెంబర్ 203… 2020 నాటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు లిఫ్ట్ చేసి..రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఎనిమిది టీంఎంసిలు నీటిని తరలించడానికి కేసీఆర్ అనుమతి ఇవ్వలేదా అని ప్రశ్నించారు.తండ్రి పోతిరెడ్డిపాడు కు బొక్క పెట్టీ నాలుగు టిఎంసి ల నీటిని రోజు తరలించుకు పోవాలని పోతే…కొడుకు వచ్చి ప్రగతి భవన్ లో ఆరు గంటలు కృష్ణ జలాల మీద చర్చలు చేసి రోజుకు 8 టీం సిలు నీరు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించక పోవటానికి కేసీఆర్ అనుమతి ఇచ్చి ..కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 …మే 5 2020 నా ఆమోదం పొందింది అని పేర్కొన్నారు.

Exit mobile version