Home Uncategorized కౌలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లిన బడ్జెట్ : కౌలు రైతుల కమిటీ

కౌలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లిన బడ్జెట్ : కౌలు రైతుల కమిటీ

దేశంలో కౌలు రైతులను గుర్తించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులు ఇస్తారని ఆశపడుతున్న తరుణంలో బడ్జెట్ కౌలు రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు వై.రాధాకృష్ణ, కార్యదర్శి హరిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో కౌలు రైతులు , కౌలు వ్యవసాయం వేగంగా పెరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా కౌలు రైతులను గుర్తించమని , ప్రభుత్వ పథకాలన్నీ వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకే ఇవ్వాలనే కోరిక దేశంలో కౌలు రైతులు , వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు . కనీసం ఎన్నికలవేళ అయినా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి.. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చే నిధులను పెంచలేదు . బడ్జెట్లో ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి కి కేటాయింపులు కూడా పెంచలేదు. పంటలకు కనీస మద్దతు ధరలు ఇవ్వడానికి గాని రైతు రుణమాఫీ పై గాని బడ్జెట్ ఏమీ చెప్పలేదు.

పంటల అనంతరం దిగుబడి నిల్వ చేయడం , సరఫరా మార్గాలు , వివిధ స్థాయిలలో ప్రాసెసింగ్ ,మార్కెటింగ్ లలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచి పోషించేందుకు ఈ బడ్జెట్ హామీ ఇవ్వడం అంటే… కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.వ్యవసాయ రంగానికి 81 వేల కోట్లు , ఆహార సబ్సిడీలో 60,470 కోట్లు ,ఎరువుల సబ్సిడీలో 62,445 కోట్ల కేటాయింపును తగ్గించారన్నారు. . అంటే రానున్న కాలంలో ఆహార భద్రత ప్రమాదంలో పడబోతుంది. ఎరువుల ధరలు పెరుగుతాయి. వ్యవసాయం నుండి రైతాంగం ప్రతిరోజు ఇతర వృత్తులకు , ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు . వలసలు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు లక్ష మందికి పైగా రైతులు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.ఈ బడ్జెట్ వలసలను , ఆత్మహత్యలను ఆపడానికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రైతులు , ప్రజలు ఎదురుచూసిన చమురు ధరలు తగ్గించకపోవడం అంటే ఈ ప్రభుత్వం అంబానీ , ఆదానిల ప్రయోజనాలకే కట్టుబడి ఉందని స్పష్టంగా తెలియజేస్తుంది. ఎరువుల సబ్సిడీ తగ్గించిన బడ్జెట్… నానో యురియా విజయవంతం అయ్యింది కాబట్టి.. నానో డీఏపీ నానో ఎరువులు ప్రోత్సహించడానికి ప్రతిపాదించింది .ఇవి రైతులకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని కౌలు రైతుల సంఘం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి కేటాయించిన లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులను వెనక్కి తీసుకుంటే ఎంత రైతుల పట్ల ఎంత వ్యతిరేకి గా ఉందో.. కార్పొరేట్ కు శక్తులకు ఎంత అనుకూలంగా ఉందో అర్ధం అవుతుందని అన్నారు.

Exit mobile version