Home Uncategorized గ్రూప్- 2 మొయిన్స్ కు 1:100 నిష్పత్తి లో ఎంపిక చేయాలి : డివైఎఫ్ఐ

గ్రూప్- 2 మొయిన్స్ కు 1:100 నిష్పత్తి లో ఎంపిక చేయాలి : డివైఎఫ్ఐ

ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న దృష్ట్యా ప్రిలిమినరీ పరీక్ష నుండి మొయిన్స్ కు 1:50కి బదులుగా 1:100 ఎంపిక చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ కు, సభ్యులు పరిగె సుధీర్ లకు ఎమ్మెల్సీ కెయస్ లక్ష్మణరావు మరియు డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్నలు మెమోరాండం అందజేశారు. చాలా కాలం తర్వాత వచ్చిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు తగినంత సమయాన్ని ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో భారత సమాజం సిలబస్ కు పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవని, అదే సమయంలో ప్రిలిమినరీ పరీక్షలో మెంటల్ఎబిలిటి విభాగ ప్రశ్నలు కఠినంగా ఉండటం వల్ల సమయం సరిపోలేదని చాలా మంది అభ్యర్థులు పేర్కొన్నారని గుర్తు చేశారు. కారణాల దృష్ట్యా ప్రిలిమినరీ నుండి మొయిన్స్ కు 1:100 ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.