Home Uncategorized జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, ప్రజాబలం లేదని, మేనిఫెస్టో లో చెప్పినవి చేయలేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకు అయ్యా చంద్రబాబు? తన నడక కోసం అటో కర్ర … ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకు? సైకిల్ తోయ్యడానికి నికు ప్యాకేజ్ స్టార్ ఎందుకు అయ్యా చంద్రబాబు అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాప్తాడు లో జరిగిన “సిద్ధం ” సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ఐదేళ్ళల్లో జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు. వైయస్సార్ సిపి చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉందని చంద్రబాబు కు తెలుసు.ప్రతి గ్రామానికీ, ప్రతి సామాజిక వర్గాన్ని మంచి జరిగింది. అందుకే ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ ను పెట్టుకున్నారు కాబట్టే..చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లలో 125 సార్లు బటన్ నొక్కి…ప్రతి అక్క చెళ్ళమ్మా కుటుంబాలకు రూ. 2,85,000 కోట్ల రూపాయలు ను పంపించిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సామాజిక వర్గాన్ని చూసినా…14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడా కనిపించదు…ప్రతి ఇంట్లోను ప్రతి గ్రామంలో కనిపించేది 2019 లో సిఎం అయిన జగన్మోహన్ రెడ్డి మార్క్ పాలనే కనిపిస్తుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేఖంగా ఓటు వేయడమే..బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మా ల కుటుంబ ఖాతాల లోకి డబ్బులు పోయే డిబిటి కి వ్యతిరేఖంగా ఓటు వేయడమే అని స్పష్టం చేశారు. ప్రజలకు మనకు మొదటి సారి అధికారం ఇస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయకలిగాం.ప్రజలను మనల్ని సెకండ్ టైం, ఫోర్త్ టైం ఆశీర్వదిస్తే ఇంకా ఎంత మంచి జరుగుతుంది అని ప్రతి వైసిపి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వివరించాలని కోరారు.

రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్ధం.

2024 లో జరగపోతున్న ఎన్నికలు యుద్ధం .. కేవలం ఎమ్మెల్యే , ఎంపి లను ఏన్నుకొనే ఎన్నికలు మాత్రమే కావు. ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమం,
అభివృద్ధి పథకాలు కొనసాగాలి అని అడుగులు వేసే మనం ఒక వైపు..ఇప్పటివరకు కొనసాగుతున్న పథకాలు అన్ని రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, డ్రామాలు ఆడుతున్నా చంద్రబాబు కు మధ్య జరిగే ఈ యుద్ధం అని తెలిపారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.
పేదల ఒక వైపు ఉంటే, పెత్తందారులు మరో వైపు ఉండి ఈ యుద్ధం జరగబోతుంది.ఈ యుద్ధం… మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు…మాట తప్పడం అలవాటు గా ఉన్న పెత్తందారులుకు జరగబోతుంది. ఈ యుద్ధం విశ్వసనీయతకు,వంచనకు మధ్య యుద్ధం జరగబోతుంది.పేదవాడి భవిష్యత్ కొరకు పేద వాడి తరపున నిలబడటానికి మీరు అంతా సిద్ధ మేనాఅని ప్రశ్నించారు.

బావ దారిద్ర్యం బాబు నైజం.

మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు…తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చిన వాటిలో ఎదైనా కూడా కనీసం 10 శాతం అమలుచేశామని చెప్పాలని సవాల్ విసిరారు. గతం ప్రజలకు గుర్తు ఉండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరో సారి అలనాటి అబద్ధాలు అలాంటి మోసాలు…మారో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఉబిలోకి దింపే కథ ఆ పులి మాదిరిగా ఎర చూపిస్తున్నాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రంగు రంగుల మేనిఫెస్టో అంటున్నారు. ఆరు స్కీమ్ లు అంటారు…ఇంకా ఆరు రావాల్సిన వి ఉన్నాయి అంటారు. చేసేది ఎలాగూ మోసం కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం అని మండిపడ్డారు. నోటికి కట్టడి ఎందుకు ..అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు ? అన్నది బాబు నైజం.. నమ్మిన వాడు మునుగుతాడు. నమ్మించిన వాడు ధోచుకొకలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ను చూస్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు ..మోసం

బాబు వంచనలను మోసాలను భరించే లేకే… ఐదేళ్ల క్రితం అన్ని ప్రాంతాల వారు చొక్కా మడత వేసి, బాబు కు ఉన్న కుర్చీలను మడిచి చిల్లుతో ఉడ్చి వారి పార్టీ నీ శాసనసభలో 102 నుంచి 23 కు తగ్గించారు. అదే పని మరో సారు చేయటానికి కుర్చీలు మడత పెట్టడానికి సిద్ధమా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు ను చూస్తే గుర్తుకువచ్చేది వెన్నుపోటు…మోసాలు తప్పా…కనీసం ఒక్క స్కీమ్ అయిన గుర్తుకువస్తుందా అని ప్రశ్నించారు.

99 శాతం హామీలు అమలు చేశాం

ఈ ఐదేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ప్రతి అక్క చెల్లెమ్మ హృదయాన్ని తట్టాం.విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగలిసిన అవసరం ఎంత ముఖ్యమో..ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న అక్క కు ,అన్నాకు,తమ్ముడు కి ,అవ్వా తాత కు చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం ఒక స్టార్ కాంపెయిన్ ర్ ఇంట్లో నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ సిపి ప్రతి కార్యకర్త , ప్రతి వాలంటీర్…ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించాలి…వారినీ పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించల్సిన అవసరం గురుంచి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అవసరం ఉందని తెలిపారు.

ఒక్కసారి అధికారం ఇస్తేనే…రైతులకి అదనంగా ఇంతక ముందు ఎప్పుడూ రైతన్నుల చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసా నీ తీసుకొని ఇచ్చాం…గ్రామాల్లో రైతన్నకు చేయు పట్టుకొని నడిపించే ఆర్బి కే వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం. పగటి పూట రైతన్నలకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాం. మొట్ట మొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం మొదలు పెట్టింది వైసిపి వచ్చిన తరువాత నే అని గుర్తు చేశారు. 2019 లో సిఎం అయిన జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే.. అక్క చెల్లెమ్మలు కు అమ్మఒడి..ఆసరా..సున్నా వడ్డీ…చేయూత.. కాపు నేస్తం,ఈబిసి నేస్తం,31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్న పరిస్థితి…ప్రతి అక్క చెళ్మ్మమ్మ లకు దిశా యాప్ తీసుకువచ్చాము అని తెలిపారు.

మరో గొప్ప చారిత్రత్మక విజయానికి మీరంత సిద్ధమేనా?

ఈ 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి వెళ్లిపోతుంది, ఇక టీడీపీ రూపురేఖలు కూడా కనిపించవని జోస్యం చెప్పారు.అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకం, అందుకే పెత్తందారు ఏకమవుతున్నారు అని తెలిపారు. మన యుద్ధం చంద్రబాబుతో మాత్రమే కాదు, ఒక్క పచ్చమీడయాతో యుద్ధం చేస్తున్నాం, వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం, జాతియపార్టీనికుడా వారితో తెచ్చుకుంటున్నారు అని విమర్శించారు.

మీ జగన్ కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి

మీ జగన్ ప్రతి అక్కచెల్లమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి రైతన్న జగనన్నకి తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాలి. ఈ ఎన్నికల పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించేవే అని తెలుపుతున్నానని పేర్కొన్నారు. పేదవాడి భవిష్యత్తు మారాలన్ని, పేదవాడి పిల్లలు పెత్తందారులతో పోటీ పడాలంటే పెత్తందారుల పార్టీని నాశనం చేసే పరిస్థితిరావాలి అని అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వ కలకాలం ఉండాలని, మరోఆవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

Exit mobile version