Saturday, April 27, 2024
Home మా ఎడిటోరియల్ YSRCP: వైసీపీ@ అద్దంకి, చీరాల, పర్చూరు..! వాళ్ళు వినరు.. వీళ్ళు ఆగరు..!!

YSRCP: వైసీపీ@ అద్దంకి, చీరాల, పర్చూరు..! వాళ్ళు వినరు.. వీళ్ళు ఆగరు..!!

- Advertisement -

YSRCP: చీరాల వైసీపీలో పెత్తనం ఎవరిది..!? ఇద్దరు నాయకుల్లో ఎవరిని కొనసాగిస్తారు..? ఎవరిని పక్కన పెడతారు..!? ఇది వైసీపీలో అంతర్గతంగా దాదాపు ఏడాదిన్నరగా నలుగుతున్న సమస్య.. ఈ నియోజకవర్గ మార్పులపై మరో రెండు అద్దంకి, పర్చూరు కూడా ఆధారపడి ఉన్నాయి. దాదాపు ఏడాది కాలంగా ఒక పెద్ద ప్రతిపాదన వైసీపీలో చక్కర్లు కొడుతూ వస్తుంది. “చీరాల వైసీపీ ఇంఛార్జిగా బీసీ నాయకుడికి ఇచ్చేసి.. ఆమంచి కృష్ణ మోహన్ కి పర్చూరు ఇంఛార్జిగా.., కరణం వెంకటేష్ కి అద్దంకి ఇంఛార్జిగా ఇస్తారు” అనే ఆలోచన 2020 జనవరి నెలలోనే ఖరారు చేసారు, సీఎం జగన్ ఒకే చేసారు. కానీ అటు ఆమంచి, ఇటు కరణం ఇద్దరూ చీరాలను వదిలి రావడానికి సిద్ధంగా లేరు. ఏ ఒక్కరు అక్కడి నుండి వచ్చినా మిగిలిన వారు తమ తమ వర్గాలను ఇబ్బంది పెడతారని ఇద్దరిలోనూ భయం ఉంది. అది ఒకరకంగా నిజం కూడా..! ఆ నియోజకవర్గంలో పార్టీ కంటే వ్యక్తి, వర్గం, బలంపైనే ప్రస్తుత రాజకీయం నడుస్తుంది. సో.., చీరాలని వదిలితే ఇద్దరూ ఒకేసారి వదిలేసి బయటకు రావాలి. లేదా ఇద్దరూ అక్కడే ఎలాగోలా పోటీపడి ఏదో ఒకటి చేసుకోవాలి. పార్టీ కూడా అంతకు మించి ఏమి చేయలేదు..! పార్టీ పెద్దలు పదే పదే చెప్తున్నప్పటికీ ఆమంచి పర్చూరు వెళ్ళడానికి ససేమిరా అంటున్నారు. వెంకటేష్ కూడా అద్దంకికి ససేమిరా అంటున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి, ఎవరి నమ్మకాలు వారికున్నాయి, ఎవరి బలాలు వారికున్నాయి..! కాసేపు ఈ విషయాన్నీ పక్కన పెడదాం..!

YSRCP: Three Constituencies Thirty Issues

YSRCP: ఏడాదిలో ఎన్నో మారాయి..!? ఇప్పుడెలా..!?

గత ఏడాది జనవరిలో సీఎం జగన్ ఈ ప్రతిపాదనకు ఫైనల్ చేసారు. అప్పట్లోనే ఆమంచి ఆసక్తి చూపలేదు.. కానీ లోలోపల ఆలోచించడం మొదలు పెట్టారు.., కానీ.. కరణం మాత్రం అద్దంకిపై అంతగా ఆసక్తి చూపలేదు. తమను నమ్మి ఓటేసిన చీరాలకు దూరమవ్వడం ఇష్టం లేదంటూ పార్టీలో చెప్పుకొచ్చారు. ఆ డైలమా పరిస్థితి అలాగే కొనసాగుతూ ఉండగా.. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చీరాల రాజకీయం అనూహ్యంగా మారిపోయింది.. ఆ ఎన్నికల్లో ఆమంచి వర్గం బలం చాటడంతో ఆమంచికి చీరాలపై మళ్ళీ పట్టు పెరిగింది. నమ్మకం కుదిరింది. ఆయన వర్గం కూడా అప్పటి నుండి చురుకయింది. పార్టీని ధిక్కరించి పార్టీకి రెబల్ గా వేసి గెలవడం, మళ్ళీ అదే పార్టీలో చేరడం.., రెబల్ గా వేసినప్పటికీ పార్టీ పెద్దలు కూడా సీరియస్ గా ఏమి యాక్షన్ తీసుకోకపోవడంతో రెండు వర్గాల్లో మళ్ళీ పునరాలోచనలు మొదలయ్యాయి. మరోవైపు కరణం వెంకటేష్ కూడా చీరాలలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తన పరిచయాలు, నెట్వర్క్, బలం, బలగం పెంచుకున్నారు. అదే క్రమంలో పార్టీ కార్యక్రమాలు, నాయకులతో మంతనాలతో చీరాలలో తిష్ట వేశారు. సో.., గతేడాది జనవరి, ఫిబ్రవరి నాటికి ఉన్న పరిస్థితులు అలా అలా మారిపోయాయి.. ఇక్కడ ఇలా ఉండగా…

YSRCP: Three Constituencies Thirty Issues
  • అద్దంకిలో ఏడాది కాలంలో ఇంఛార్జిగా బాచిన కృష్ణ చైతన్య బలపడ్డారు. ఇన్చార్జిగానే ఇచ్చారు, సీటు ఇస్తారో లేదో అనుమానమే.. అని కార్యకర్తలు, నాయకుల్లో కూడా ఒకరకమైన డైలమా ఉన్న సమయంలో ఇంఛార్జిగా ఈ ఏడాదిలో ఎంతో “పొలిటికల్ మెచ్యూరిటీ” చూపించారు. పార్టీకి అనుహ్యమైన ఫలితాలు అందించారు. తనలో కొత్త కోణాన్ని, తనలో కొత్త నాయకున్ని అద్దంకికి పరిచయం చేశారు. గ్రామా పంచాయతీలు, పరిషత్ లు ఏకపక్షంగా గెలిపించి.., పోటాపోటీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీని గెలిపించి రెండు రకాలుగా ఆయన ఇమేజ్ పెంచుకున్నారు. “పార్టీలో దిగువ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులకు.. అటు పార్టీ పెద్దలకు కూడా తాను నియోజకవర్గంలో ధీటైన నాయకుడిని.. అనే సంకేతాలు, సాక్ష్యాలు, ఆధారాలు, ఉదాహరణలతో సహా నిరూపించారు. ఈ దెబ్బతో అద్దంకికి కరణం వెంకటేష్ ని పంపించాలి అనే ప్రతిపాదనపై పార్టీ పెద్దలు పునరాలోచనలో ఉన్న పరిస్థితి తీసుకొచ్చారు..!
  • సో.., ప్రస్తుతం అయితే చీరాల సరిచేయాలంటే అక్కడున్న ఇద్దరికీ రెండు వేరే నియోజకవర్గాలు ఇవ్వాలి కాబట్టి ఆమంచికి పర్చూరు, వేంకటేష్ కి అద్దంకి అని పార్టీ ఆలోచిస్తే ఆలోచించవచ్చు గాక… కానీ దాని వలన లాభం కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చీరాలలో ఆ రెండు వర్గాలు కలిసి పని చేయవు సరికదా.., కొత్తగా ఇంచార్జి తీసుకునే బీసీ ఇంచార్జిపై ఒత్తిడి పెరుగుతుంది. రెండు వర్గాల నుండి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. మరోవైపు పర్చూరులో అధికార పార్టీని నమ్ముకున్న కమ్మ, రెడ్డి క్యాడర్ కొంత డిస్టర్బ్ అవుతుంది.
YSRCP: Three Constituencies Thirty Issues
YSRCP: Three Constituencies Thirty Issues
  • అన్నిటి కంటే ముఖ్యంగా అద్దంకిలో ఏడాదిగా నిర్మించిన కోటలు కొంత మేరకు కూలిపోతాయి. వెంకటేష్ వస్తే బాచిన కృష్ణ చైతన్య సాదర స్వాగతం పలికే అవకాశమే లేదు. వారిది ముందు తరాల శత్రుత్వం. ఇద్దరికీ బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయి. వారి తండ్రులకు స్థిరమైన చరిత్ర, ముద్ర ఉంది. సో.. వారిద్దరూ ఒకే పార్టీలో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయలేరు. చీరాలలో పరిష్కారం కోసం మందు వేస్తే అద్దంకిలో కొత్త సమస్య సృష్టించినట్టు అవుతుంది.. చీరాల కంటే వైసీపీకి అద్దంకి చాలా ముఖ్యం. ఇక్కడ బలమైన నాయకుడిగా ఉంటూ జగన్ గాలిని సైతం ఢీకొన్న రవికుమార్ ని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే వైసీపీ పెద్దల లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరే నేపథ్యంలో ఇలా ముందు నుండి వర్గాలు పెంచుకోవడం, ఘర్షణలు, పోరు పడలేరు. అది పార్టీకి అంత మంచిది కాదు.. పైగా మంత్రి బాలినేని సహా.., పార్టీ పెద్దలు కూడా కృష్ణ చైతన్యపై నమ్మకంతో ఉన్నారు. అందుకే చీరాలలో ఎలాగూ ఈ ఇద్దరూ వినడం లేదు కాబట్టి.., అక్కడ కొన్నాళ్ళు అలాగే కొనసాగించి, అద్దంకిని మాత్రం కదపకుండా ఉంచాలనేది నిర్ణయంగా తెలుస్తుంది. అయితే ఈ లోగా చీరాలలో రెండు వర్గాల భజనపరులు.., అద్దంకిలో భజనపరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా పుకార్లుని విపరీతంగా వ్యాప్తి చేసుకుంటున్నారు. నిజానికి ఈ మూడు నియోజకవర్గాలు పార్టీకి అత్యంత కీలకమైనవి. అంత ఈజీగా తేల్చలేరు. సోషల్ మీడియాలో రాసుకున్నంత సులువుగా నాయకులను మార్చలేరు. నాయకత్వాన్ని మార్పులు చేయలేరు. సున్నితమైన వర్గాలు, భావోద్వాగాలు, నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉంటారు. అందుకే పుకార్లను నమ్మకుండా.., పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు ఏది నమ్మకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం మూడు నియోజకవర్గాల్లో పార్టీకి మంచిది..!
- Advertisement -
RELATED ARTICLES

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు...

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు "అద్దంకి, పర్చూరు, చీరాల"పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Most Popular

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...