Friday, May 10, 2024
Home వార్తలు Honour Murder: తెలంగాణలో మరో పరువు హత్య.. స్తంభానికి కట్టేసి తలలో మేకులు దింపి మరీ..

Honour Murder: తెలంగాణలో మరో పరువు హత్య.. స్తంభానికి కట్టేసి తలలో మేకులు దింపి మరీ..

- Advertisement -

Honour Murder in Telangana: తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో జరిగిన ప్రణయ్ పరువు హత్య అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అమృత ప్రేమించిన యువకుడు ప్రణయ్ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో కుటుంబ పరువు పోయినట్లుగా భావించిన అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతక ముఠాతో అల్లుడిని దారుణంగా హత్య చేయించడం, ఆ తరువాత కొన్ని నెలలకు మనోవేదనతో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో పరువు హత్య జరగడం తీవ్ర సంచలనాన్ని రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని మామ కిరాయి హంతముఠాతో చంపించిన తీరు తీవ్రంగా కలచివేస్తుంది.

Honour Murder in Telangana: సామాజికవర్గం వేరు కావడంతో

- Advertisement -

వివరాల్లోకి వెళితే…యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ హోంగార్డుగా పని చేస్తున్న సమయంలో యాదాద్రికి చెందిన భార్గవి అనే యువతిని ప్రేమించుకున్నారు. భార్గవి ముదిరాజ్ సామాజికవర్గం కాగా, రామకృష్ణ గౌడ సామాజికవర్గంకు చెందిన యువకుడు. భార్గవి తండ్రి కాస్త రాజకీయ పలుకుబడి ఉన్నవాడు కావడంతో పాటు ఆర్ధికంగా స్థితి మంతుడు. దీంతో వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 16న భార్గవి – రామకృష్ణ లు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తరువాత కొద్ది రోజులు లింగరాజుపల్లి గ్రామంలో ఆ తరువాత భువనగిరిలో కాపురం పెట్టారు. వీరికి ఆరు నెలల పాప ఉంది. రామకృష్ణ వివాహం అయిన తరువాత గుప్త నిధుల తవ్వకాల్లో సహకరించాన్న అభియోగంతో హోంగార్డు ఉద్యోగం నుండి తొలగించారు. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా రామకృష్ణ పని చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన భార్గవి తండ్రి వెంకటేష్ అల్లుడు రామకృష్ణను అంతమొందించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ క్రమంలో కిరాయి హత్యలు చేసే రౌడీ షీటర్ లతీఫ్ కు సుపారి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వెంకటేశ్ తో ఒప్పందం చేసుకున్న లతీఫ్ కొందరు వ్యక్తులతో ఫోన్ చేయించి కొనుగోలుకు భూమి చూపించాలంటూ హైదరాబాద్ శివారు ప్రాంతానికి రామకృష్ణ గౌడ్ ను తీసుకువెళ్లారు.

ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా

- Advertisement -

అయితే బయటకు వెళ్లిన భర్త రాత్రి సమయానికి రాకపోవడంతో భార్గవికి అనుమానం వచ్చి మొన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా సిద్దిపేట కుకునూరు పల్లి వద్ద రామకృష్ణ గౌడ్ మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. అతని ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా భార్గవి తండ్రే వెంకటేశ్ రౌడీ షీటర్ తో ఈ హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. రామకృష్ణను ఓ స్తంభానికి కట్టేసి తలపై మేకులు కొట్టి మరీ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...