Monday, April 29, 2024
Home వార్తలు CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి .....

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి .. బీఫారం అందజేత

- Advertisement -

CM YS Jagan: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ బీ ఫారం అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న క్రమంలో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో విక్రమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా విక్రమ్ రెడ్డి భిఫారం అందుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మృతితో   ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా నిలపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం ఈ నెల 6వ తేదీ వరకూ జరుగుతుంది.  ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. 26వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...