Monday, April 29, 2024
Home వార్తలు Darsi Elections: "దర్శి"లో గెలుపెవరిది..!? ఎవరికీ ఎన్ని వార్డులు..!?

Darsi Elections: “దర్శి”లో గెలుపెవరిది..!? ఎవరికీ ఎన్ని వార్డులు..!?

- Advertisement -

Darsi Elections: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. జిల్లాలోని దర్శి నగర పంచాయతీలో ఎన్నికలు ముగిసాయి.. దాదాపు 78 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. ఇప్పుడు ఫలితాల కోసం ఎవరి అంచనాల్లో వారున్నారు.. ఎవరి లెక్కల్లో వారున్నారు.. అధికార వైసీపీ ధీమాగానే ఉన్నప్పటికీ.. టీడీపీ నుండి ఈ స్థాయిలో ఫైటింగ్ అధికార పార్టీ ఊహించలేదు.. ఏకపక్షంగా జరగాల్సిన ఎన్నికలకు కాస్త.. అధికార పార్టీకి ధీటైన పోటీ ఇస్తూ పోల్ మేనేజ్మెంట్ లో కూడా ఇరు పార్టీలు పోటీ పడ్డాయి.. దీంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

వైసీపీ తరపున గెలుపు బాధ్యతని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తన భుజాన వేసుకున్నారు.. అయితే ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.. ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.. వైసీపీలో కూడా ఈ పేర్లపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. అయితే అందరూ కలిసే పని చేసారు. వర్గ విబేధాలు వదిలేసి.. ఎమ్మెల్యే వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గం కలిసి పార్టీ కోసం పని చేశారు. అంచేత ఎక్కడా సమస్యలు రాలేదు.. ఆ పార్టీకి అదే పెద్ద బలం. * ఇక టీడీపీ తరపున 11 వ వార్డు నుండి పోటీ చేసిన పిచ్చయ్య చైర్మన్ అభ్యర్థిగా ఖరారయ్యారు. టీడీపీ కూడా నాయకులూ అందరూ కలిసి పని చేశారు. ఆర్ధిక అంశాల్లో కూడా ఎక్కడా తగ్గలేదు. అధికార పార్టీ ఎక్కడ ఎంత ఇచ్చారో.. టీడీపీ కూడా అంతే ఇచ్చింది. ఈ పరిణామాన్ని వైసీపీ ఊహించలేదు. 11 వ వార్డులో మాత్రం భారీగానే పంపిణీ జరిగినట్టు సమాచారం.. ఇక్కడ టీడీపీ చైర్మన్ అభ్యర్థిని ఓడించడానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేసిందని.. చేయకూడని పనులు కూడా చాలా అమలు చేశారని టాక్..!

- Advertisement -

Darsi Elections: వైసీపీకి 13.. టీడీపీకి 6..!!

- Advertisement -

దర్శి ఎన్నికలలో చాలా అంశాలు పని చేశాయి. సామజిక సమీకరణాలు.., ఆర్థికపరమైన అంశాలు.., అధికారం.., సానుభూతి.. అన్నీ రగిల్చారు. చివరి రోజున అధికార పార్టీ అన్ని రకాల అస్త్రాలను రంగంలోకి దించింది.. ఇక దర్శిలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి.. మాకు ఉన్న సోర్సులు ఆధారంగా ఈ నగర పంచాయతీలో వైసీపీ 13 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది.. టీడీపీకి 6 వార్డులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మూడు వార్డుల్లో బాగా హోరాహోరీ పోరు నడిచింది. ఈ మూడు వార్డుల్లో ఎవరు గెలిచినా 30 ఓట్లు తేడాతోనే ఫలితం మారవచ్చు..!

  • మొత్తం మీద టీడీపీ ఏమి అంత సులువుగా తీసిపారెయ్యలేదు. ఆ పార్టీ కొన్ని వార్డుల్లో 30, 40 ఓట్లు తేడాతో పోయే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం.., సరైన ఇంచార్జి లేరు.. పార్టీ పెద్దలు పట్టించుకోవట్లేదు.. అనుకునే దశ నుండి అన్నిరకాలుగా పోరాటం చేశారు. జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి ప్రచారం చేయడంతో ఊపొచ్చింది. చివరి మూడు రోజుల పాటూ జోష్ తో ప్రచారం చేశారు. ఈ అంశాలు టీడీపీకి కలిసొచ్చాయి.
  • అధికార బలంతో పాటూ.. ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గం, బూచేపల్లి వర్గాలు కలిసి పని చేయడం వైసీపీకి పెద్ద బలం.. దర్శిలో అత్యధికంగా ఉన్న కాపు, రెడ్డి సామాజికవర్గాలు వారి వారి నేతల సూచనలకు తగ్గట్టు పార్టీ కోసం బాగానే పని చేసారు. అధికారం, యంత్రాంగం సహకారం.. పోల్ మేనేజ్మెంట్ తో వైసీపీ సులువుగా చైర్మన్ సీటు ఎగరేసుకుపోయినట్టే చెప్పుకోవచ్చు..!
- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...