Home Uncategorized పది ఇస్తాడు…వంద దోచుకుంటాడు….అదే జలగన్న పాలసీ : చంద్రబాబు

పది ఇస్తాడు…వంద దోచుకుంటాడు….అదే జలగన్న పాలసీ : చంద్రబాబు

విశాఖపట్నం లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభ అంటున్నారు…ఐదు సంవత్సరాలు నుంచి ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కటౌట్ పెట్టాలన్న అడ్డు పడి ఇష్టానుసారంగా చేసిన జగన్…ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సిద్ధం అంటున్నారు. జగన్ రెడ్డి నికు అభ్యర్థులే దొరకడం లేదు. ఎన్నికలకు సిద్ధం అని మీరు మాట్లాడితే మిమ్మలని ఓడించటానికి ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాత లు సిద్ధం.మిమ్మలని తరిమికొట్టడానికి కసితో యువత సిద్ధం. జగన్ అధికార అహంభావాన్ని దింపడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. శనివారం పీలేరు లో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైయస్సార్ పార్టీ అవసరమా అని ప్రశ్నించారు. సవాల్ చేసి చెప్పుతున్న వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి గెలుపు తెలుగుదేశం జనసేన ది అని పేర్కొన్నారు.గత టిడిపి హయాంలో కు రాయలసీమకు ఇరిగేషన్ కింద .రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు

.2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరారు. కానీ ఈ ప్రాంతానికి ఒక పని చేశాడా?ఎక్కడైనా అభివృద్ధి అయ్యిందా? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు,ఒక పరిశ్రమ తీసుకురాలేదు అని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో రాయలసీమ కు జగన్ ఏం పొడిచాడు చెప్పగలరా? హంద్రీ నీవా మీద 4200 కోట్లు ఖర్చు పెట్టాం. గాలేరు నగరి మీద టిడిపి హయాంలో 1,055 కోట్లు ఖర్చు పెట్టాం.ఐదేళ్లలో వైసిపి 2000 కోట్లను కూడా ఖర్చు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహులుగామిగిలిపోయారు. రాయలసీమ లో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.
గోదావరి నీళ్ళు పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టా కు ఇచ్చి అక్కడ వాడే నీరు శ్రీశైలం ద్వారా 120 టీ ఏంసిల నీటిని రాయలసీమ కు మల్లించిన ఘనత టీడీపి ది.టిడిపి అధికారంలో కొనసాగితే..ఉంటే గోదావరి నీళ్ళు బనకచర్ల కు తీసుకువచ్చే వాళ్ళం. గోదావరి లో ప్రతి సంవత్సరం 2000 టిఎంసి లు సముద్రం లోకి పోతున్నాయి.వాటిలో కొంత వరకు తెచ్చుకుంటే రాయలసీమ రత్నాల సీమ గా మారుతుంది.మి జీవితాల్లో వెలుగు వస్తుంది. రాయలసీమ ను పండ్ల తోటలకు హబ్ తయారు గా చేయాలని అనుకున్నా ఆ ఊద్దేశం తోనే..డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇచ్చావైసిపి వచ్చాక .అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది.40 మంది చనిపోయారు,ఇంతవరకు ఆ డ్యాం కట్టారా? కనీసం డ్యాం కు గ్రీస్ వేయలేని వ్యక్తులు మూడు రాజధానులు కడతారు అంటే నమ్ముతారా? ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎక్కడ ఉండరు.ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి.కనురెప్పపాటున అబద్ధాలు చెప్పటంలో జగన్ పి హెచ్ డి చేశారు. జగన్ ఒక అబద్ధాలు కొరు..10 రూపాయలు ఇస్తారు.100 రూపాయలు దోచేసుకుంటారు.అదే జలగన్న పాలసీ.అలాంటి జలగ మనకు కావాలా?

గత టీడిపి ఐదేళ్ల పాలనలో ఒక్క సారి అయిన కరెంట్ చార్జీలు పెంచలేదు.నేడు పేదవాడి బ్రతుకు చితికిపోయింది అని ఆందోళన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ పోయింది.చంద్రన్న భీమా పోయింది.ముఖ్యమంత్రి రాజకీయ వ్యాపారి ఇపోయారు.. మద్యం షాప్ లో ఎందుకు ఆన్లైన్ లో విక్రయాలు జరపడం లేదు అని ప్రశ్నించారు.నాణ్యత లేని మందు వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.35 లక్షలు మంది అనారోగ్యం పాలైయ్యారు.మధ్యపాన నిషేధం చేస్తామని చెప్పి చేశాడా? మద్యం పేరు చెప్పి 35,000 కోట్లు అప్పులు తీసుకువచ్చారు.ఓటు అడిగే హక్కు అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా అని ప్రశ్నించారు..
మొన్నటి వరకు 175 కు 175 అన్నారు.65 మంది సీట్లు మార్చారు. ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే బంగారం ఇపోతుందా అని ప్రశ్నించారు.ప్రజా ప్రతినిధులను పవిత్రమైన రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేశారని మండిపడ్డారు.

సుపరిపాలన ఇవ్వడం,అభివృద్ధి సంక్షేమాన్ని ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ..మీరు సైకో పాలనలో నష్టపోని వ్యక్తిని, ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అందరూ బాధితులే చివరకి నేను కూడా సైకో బాధితుడినే అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసీన పార్టీలను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version