Home Uncategorized చేయి చేయి కలుపుతాం…కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం

చేయి చేయి కలుపుతాం…కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం

ఆంధ్రప్రదేశ్ పిసిసిగా భాధ్యతలు చేపట్టేందుకు వైయస్ షర్మిళ సిద్ధం అయ్యారు. ఈ నెల 21 న విజయవాడలో ఆమె పిసిసి పదవిని చేపట్టనున్నారు. అందులో భాగంగానే శనివారం తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగా చేయి చేయి కలుపుదాం..కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం అని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అంటే ప్రాణంతో సమానమని పేర్కొన్నారు. ఆ సిద్ధాంతం కోసం ఎంత దూరం అయిన వెల్లేవారన్నారు

ప్రస్తుతం భారతదేశంలో సెక్యులరిజం ఫ్లురలిజం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందని తెలిపారు.భారతదేశానికి మంచి జరగాలి.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సిద్ధిద్ధించాలి.అందుకే రాజశేఖర్ బిడ్డగా కాంగ్రెస్ లో పార్టీ చేరటం జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ సిద్ధాంతం కోసం అఖరి వరకు నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కోరుకున్న విధంగా రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేయాలన్న కోరిక రాజశేఖర్ రెడ్డికి ఉందని.. ఆ కోరికను నెరవేర్చేందుకు వైయస్ షర్మిళ కృషి చేస్తారని రఘువీరా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీను రెండు సార్లు అధికారంలోకి తీసుకురావటానికి రాజశేఖర్ రెడ్డి దోహదపడ్డారు అని పేర్కొన్నారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిళ తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి బానిసగా ఉంటున్నాయని విమర్శించారు.షర్మిళ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం…రాష్ట్ర హక్కులు సాధించుకోవటానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. రానున్న ఆగస్ట్ 15 కి ఎర్రకోట మీద ప్రధానిగా రాహుల్ గాంధీ జెండ ఎగుర వేస్తారని ఆకాక్షించారు. అనంతరం షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈరోజు ఇది ప్రారంభమని రాబోయే రోజుల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని పేర్కొన్నారు.

Exit mobile version