Monday, April 29, 2024
Home వార్తలు కాకమ్మ కబుర్లు చెబుతున్నారు : సునీత రెడ్డి

కాకమ్మ కబుర్లు చెబుతున్నారు : సునీత రెడ్డి

- Advertisement -

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని గూగుల్ టేక్ ఔట్ ఇతర అన్ని సాక్ష్యాలు చెబుతున్నపట్టకి…హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని వివేక కుమార్తె సునీత రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కడప లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…వివేకా మరణం తరువాత అవినాష్ రెడ్డి ఫోన్లో జగన్మోహన్ రెడ్డికి హార్ట్ ఎటాక్ అని చెప్పారా? హత్య అని చెప్పారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హత్య కేసుతో అవినాష్ రెడ్డికి సంబంధం లేకపోతే తన సెల్ ఫోన్ ను సిబిఐ కి సచ్చిలుడుగా బయటకు రావచ్చన్నారు.చిన్నాన్న హత్యపై విచారణకు ఐదేళ్లలో ఎంపి గా, ముఖ్యమంత్రిగా మీరు చేసిన ప్రయత్నం ఏమిటి ? ఒక పార్లమెంట్ సభ్యునిగా ఎప్పుడు ఢిల్లీ వెళ్తుంటారు..సిబిఐ విచారణ ఎంతవరకు వచ్చిందో అని ఎప్పుడైనా వాకబు చేశారా అని ప్రశ్నించారు. ఒక చిన్న హెడ్ కానిస్టేబుల్ పరిష్కరించే వివేక హత్య కేసును అధికారం అడ్డం పెట్టుకొని ఇంకా ఎంతకాలం కాలయాపన చేయిస్తారు.

చంద్రబాబు రాధాకృష్ణ సునీత రెడ్డి లు సిబిఐ ను మేనేజ్ చేస్తారా?

- Advertisement -

రాష్ట్రంలో అధికారంలో ఉంది మీరు. స్నేహపూర్వకంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం మీతోనే ఉంది. అన్ని అధికారాలు మీ వద్ద పెట్టుకొని సిబిఐ మా చేతుల్లో ఉందని ఎలా చెబుతున్నారు అని ప్రశ్నించారు. 52 రోజులుగా తన కేసులను పరిష్కరించుకోలేని చంద్రబాబు తనకు ఎలా న్యాయం చేస్తారు అని నిలదీశారు. ఆప్రోవర్ గా మారినంత మాత్రాన న్యాయ స్థానం నుంచి దస్తగిరికి ఉపశమనం లభించినట్లు కాదని పేర్కొన్నారు. తన వెనుక చంద్రబాబు , ఎబిఎన్ రాధాకృష్ణ ఉన్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు.తాను ఒక డాక్టర్ ను అని…రాధాకృష్ణ భార్య తన పేషంట్ అని…ఆమె మరణించినప్పుడు చూడటానికి వెళ్ళాను అని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు తెలంగాణ హైకోర్ట్ కు బదిలీ అయిన తరువాత కూడా భారతి రెడ్డి తండ్రి గంగి రెడ్డి మరణిస్తే పరామర్శించడానికి వెళ్ళాను. సజ్జల రామకృష్ణన్ రెడ్డి అన్నయ్య చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాను.అప్పుడు కనిపించలేదా తాను చంద్రబాబు, రాధాకృష్ణ ల మనిషిని అని నిలదీశారు.రాజకీయాలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

పార్టీ కోసం అవినాష్ రెడ్డి చేసిన కష్టం ఏమిటి ?

- Advertisement -

జగన్మోహన్ రెడ్డి జైలు లో ఉండగా పార్టీ బాధ్యతలు మోసింది షర్మిల అని తెలిపారు. మరో ప్రజా ప్రస్థానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీ పటిష్టత కోసం షర్మిల పాటు పడింది. వైకాపా పటిష్టత కోసం మీరు చేసిన కష్టం ఏమిటి? కేవలం భారతి బంధువు అనే మీకు కడప ఎంపీ టికెట్ ఇచ్చారా అని నిలదీశారు.వైకాపా తో విభేదించిన తరువాత షర్మిల మీద సాక్షి పత్రికల్లో తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు. షర్మిల ను ఎంపిగా చూడాలన్న వివేకానంద రెడ్డి చివరి కోరిక నెరవేర్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...