Home వార్తలు వైసిపి విష సంస్కృతిని ఆకళింపు చేసుకున్న పోతిన మహేష్ : తమ్మిరెడ్డి శివ శంకర్

వైసిపి విష సంస్కృతిని ఆకళింపు చేసుకున్న పోతిన మహేష్ : తమ్మిరెడ్డి శివ శంకర్

వైసిపిలో చేరిన అనతి కాలంలోనే ఆ పార్టీ విష సంస్కృతిని పోతిన మహేష్ ఆకళింపు చేసుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ విమర్శించారు.ఆదివారం మంగళగిరి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…బిసి సామాజిక వర్గానికి చెందిన మహేష్ కు పార్టీలో ఉన్నత పదవులు కల్పించామని తెలిపారు.కానీ ఆధిపత్య ధోరణితో జన సైనికులని బెదిరింపులుకు గురి చేశారని మండిపడ్డారు.విలువలు లేని నాయకులు జనసేనను వీడిన ఎటువంటి నష్టం లేదని తెలిపారు.చెంచాగిరి చేసే వారు ఏప్పటకీ ప్రజా నాయకులు కాలేరన్న విషయాన్ని మహేష్ గుర్తించుకోవాలని సూచించారు.నాడు పొత్తులు ఉండాలని కోరుకున్నారు…నేడు సీట్ రాకపోవడంతో పొత్తును వ్యతిరేకించడం మహేష్ అవకాశ వాద రాజకీయానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు పదివేలు తీసుకొని తెనాలి వైసిపి అభ్యర్థికి ఓటు వేయాలని మహేష్ కోరడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు.

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే పవన్ పై నిందారోపణలు

జనసేనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి సిఎం జగన్మోహన్ రెడ్డి కి వెన్నులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు.జన సేన ను ప్రజల్లో పలుచన చేయాలన్న దురుద్దేశంతో తాడేపల్లి స్క్రిప్ట్ ను పవన్ పై ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.పార్టీ బలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొనే పొత్తు పెట్టుకున్నాం అని పేర్కొన్నారు.

వైసిపికి అవినీతే ప్రాణ వాయువు

వైసిపికి అవినీతే ప్రాణ వాయువు. నల్లధనాన్ని మార్చడంలో వైసిపి నాయకులు సిద్ధ హస్తులు.మద్యం అమ్మకాల ద్వారా వందల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. హరిహర వీరమల్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ నల్లధనాన్ని మార్చుకున్నారని ఆరోపించడం సరికాదన్నారు.పార్టీ ఆదాయ వివరాలన్ని ఆదాయ పన్ను శాఖకు వెళ్ళడిస్తున్నాం అని తెలిపారు.

Exit mobile version