Home వార్తలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం అని తెలిపారు. రానున్న మే నెలలో ఫించన్లు ఇంటికెళ్ళి అందించకపోతే అధి ప్రభుత్వ కుట్రగా భావిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి, ప్రభుత్వ అధికారులు అడ్డంకులు కలిగించకపోతే ఫించన్ ఇంటికి చేరుతుంది అని వివరించారు. మంగళవారం పిఠాపురం ఎంపిడిఓ కార్యాలయంలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రామ సుందర రెడ్డికి అందచేసి ప్రమాణం చేశారు.

అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని త్యాగం చేసిన టిడిపి ఇంఛార్జి వర్మకు ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో వర్మకు ఉన్నత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలం పుంజుకున్నప్పటకి రాష్ట్ర ప్రయోజనాలు కోసం త్యాగం చేసి ముందుకు వెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాల్లో బలమైన ప్రజా నాయకులు ఉన్నా పోటీ పోటీ నుంచి విరమించున్నాం అని పేర్కొన్నారు.కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఉపాధి అవకాశాలు కోసం.. ఓఎన్జీసి కాలుష్య నియంత్రణ అంశాలపై పార్లమెంట్లో బలమైన గొంతుకుగా ఉదయ్ నిలబడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు, పిఠాపురం టిడిపి ఇన్చార్జి వర్మ,కాకినాడ ఎంపి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version