Saturday, April 27, 2024
Home వార్తలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజా అరెస్టులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజా అరెస్టులు

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా ఈడీ చేసిన అరెస్టులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. రాజకీయ, వ్యాపార వర్గాలను తీవ్ర కలకలాన్ని రేపుతున్న డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏపి, తెలంగాణకు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న పి శరత్ చంద్రారెడ్డి తో పాటు వినయ్ బాబును ఈడీ అరెస్టు చేసింది. వినయ్ బాబు పెర్నాడ్ రికార్డు లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు మూడు రోజులుగా శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను విచారించారు. వారి వద్ద నుండి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం వారి ఇరువురిని అరెస్టు చేశారు.

తెలంగాణకు చెందిన రాబిన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబాయికి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును గతంలోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమ్ ఆద్మీ పార్టీతో పాటు వివిద రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తొంది. ఈ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన దినేశ్ అరోరా అప్రూవర్ గా మారారు. దినేశ్ ఢిల్లీ ఢిప్యూటి సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడు. తాజాాగా ఇడి అరెస్టు చేసిన పి శరత్ చంద్రారెడ్డి.. ఏపి వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి అల్లుడి సోదరుడు.ఈ అరెస్టులపై టీడీపీ స్పందించింది.

- Advertisement -

తెలుగుదేశం చెప్పింది అక్షర సత్యం అయ్యిందని టీడీపీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లింక్ లు అన్నీ వైసీపీ తోనే అని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇంకా మేము అమాయకులం అని బొంకితే జనం చీ కొడతారని టీడీపీ పేర్కొంది. కాగా అరెస్టు చేసిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ కార్యాలయానికి తరలించారు. నిందితులు ఇద్దరిని ఈ రోజు సీబీఐ కోర్టుకు హజరుపర్చనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

Most Popular

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...