Tuesday, April 30, 2024
Home వార్తలు ఇంటర్‌ "రీ వెరిఫికేషన్" బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

- Advertisement -

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ప్రకటన విడుదల చేశారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం కూడా ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. ఒక్కో పేపర్‌ జవాబు పత్రం రీ వెరిఫికేషన్‌కు రూ.1300 చెల్లించాలని పేర్కొన్నారు. ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలని తెలిపారు. ఇక సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రూ.550 చెల్లించాలి అని తెలిపారు. ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని ఆయన వివరించారు.

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలను కుంటే.. అటువంటి వారు రూ.550 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. దీంతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం రెండింటికీ ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1240 ఫీజుగా చెల్లించాలని ఆయన సూచించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ తమ కాలేజీల్లోని ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని సూచించారు. కాగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్నామని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్ 24వ తేదీల్లో ఫీజు చెల్లించిన వారు మాత్రమే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయం అన్ని జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ తమ విద్యార్ధులకు తెలియ జేయాలని సౌరభ్‌ గౌర్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...