Thursday, May 9, 2024
Home వార్తలు ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

- Advertisement -

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో లో 200 మంది ఆర్యవైశ్యులు బాలినేని నివాసంలో వైఎస్ఆర్సిపి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరిని బాలినేని శ్రీనివాస రెడ్డి , యువ నేత బాలినేని ప్రణీత రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మొదటినుంచి ఆర్యవైశ్య సోదరులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా తానే ఉన్నానని గుర్తు చేశారు. ఇటీవల ఆర్యవైశ్య సోదరులకు ఆరామ క్షేత్రం లేదని తెలపగా…వెంటనే అధికారులను పిలిపించి స్థలాన్ని ఇచ్చామన్నారు. రెండు దశాబ్దాలుగా సమస్యలో ఉన్న గోశాల సమస్య పరిష్కరించానని తెలిపారు. బాబుజి కాంప్లెక్స్ రెగ్యులరైజేషన్ కూడా పూర్తి చేస్తామన్నారు. నగరంలో బాబూజీ కాంప్లెక్స్ ప్రారంభించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్యని. ఆయన చనిపోగానే మేము నగరంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గుర్తు చేసుకుంటామని అసెంబ్లీలోనే నేను తెలపడం జరిగిందన్నారు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్క సర్వే వైఎస్ఆర్సిపి దే అధికారం అని చేపట్టబోతుందని సర్వేలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. వచ్చేది వైసిపి ప్రభుత్వమేనని, ఆర్యవైశ్యులకి ఇంకా మంచి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కష్టపడి ఎన్నికల్లో పనిచేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ. జే కృష్ణ. కారం శెట్టి కిరణ్ తడవర్తి వాసు మునగా కృష్ణారావు. మట్ట హర్ష. వైసిపి నాయకులు నగర అధ్యక్షుడు కటారి శంకర్ మాజీ ఎమ్మెల్యే కసుగుర్తి ఆది అన్న. మాజీ పి టి సి సి బ్యాంక్ చైర్మన్ వెంకయ్య గంటా రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...