Monday, April 29, 2024
Home వార్తలు Chandrababu: టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ అవినీతి కక్కిస్తా - చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ అవినీతి కక్కిస్తా – చంద్రబాబు

- Advertisement -

Chandrababu: వైసీపీ ప్రభుత్వ మూడేళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందనీ, టీడీపీ అధికారంలోకి రాగానే వారి అవినీతిని కక్కిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో మహానాడు ముగింపు సందర్భంగా జగన్మోహనరెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తనకు తాను కాపాడుకునేందుకు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాడని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ప్రభుత్వ పలిపాలన పూర్తిగా అస్తవ్యస్తం అయిందన్నారు. అమరావతిని చంపేశాడు, పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు తొలగిస్తే జగన్ వచ్చి మీటర్లు పెడుతున్నారన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ .. ఇప్పుడు కేంద్రం కాళ్ల మీద పడే పరిస్థితి దాపురించిందని విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాభీష్టంకు అనుగుణంగా జిల్లాల విభజన పై పునః సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కాపురంను జిల్లా చేయాలన్న డిమాండ్ ను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరుకున్నారని చంద్రబాబు చెప్పారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని అన్నారు చంద్రబాబు సీఎం జగన్ ను త్వరగా ఇంటికి పంపాలన్న కసి ప్రజల్లో ఉందన్నారు. క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అయిదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తుంటే పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని నిర్వహించారనీ, గడప గడపకు వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. రకరకాలుగా అడ్డంకులు సృష్టించినా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున మహానాడుకు తరలివచ్చారని ఇదే నిదర్శనమని అన్నారు. జగన్ కు ఈ రోజు నిద్ర రాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని సంవత్సరం మొత్తం పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రతి జిలాల్లో మహనాడు పెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అవినీతి విధానాలను ఎండగట్టేందుకు ముందుకు వెళ్దామన్నారు. రాజకీయ నేరగాళ్లు వచ్చారని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం 8 వేల కోట్లు అప్పు చేసిందనీ, సంక్షేమ పథకాల పేరిట లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ అప్పును జగన్ చెల్లిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. క్వార్టర్ బాటిల్ మందు ధర రూ.9లు ఉండేది దాన్ని ఈ ప్రభుత్వం రూ.21లు చేసిందన్నారు. అందులో 12 రూపాయలు జగన్ జేబులోకి వెళుతున్నాయని ఆరోపించారు. నాసిరకం మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వేలాది ఎకరాలు కబ్జాలు చేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వానికి ఉరివేసి బంగాళాఖాతంలో కలపాలని చంద్రబాబు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...