Home మా ఎడిటోరియల్ YSRCP: సీఎం షాకింగ్ నిర్ణయం!? బాలినేని మెత్తబడకపోతే సెన్సేషన్స్!?

YSRCP: సీఎం షాకింగ్ నిర్ణయం!? బాలినేని మెత్తబడకపోతే సెన్సేషన్స్!?

YSRCP: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికల్గించిన విషయం తెలిసిందే. వైసీపీలో ఎన్నడూ లేనటువంటి అసమ్మతి, అసంతృప్తిని కూడా రగిల్చిన అంశం మూడు నాలుగు రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మంత్రి పదవులు రాలేదని అలిగి అసంతృప్తి, అసమ్మతి రాజేసినవారి జాబితా పెద్దదే ఉంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, శిల్పా చక్రపాణి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కరణం ధర్మశ్రీ నుండి తాజా మాజీలుగా మారిన మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి లు కూడా  తమ ప్రయత్నాలు చేస్తూ చివరకు మెత్తబడ్డారు. అయితే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని విషయంలో ఒక ఆసక్తికరమైన, అనూహ్యమైన చర్చ జరుగుతోంది. పదవి నుండి తప్పించిన తరువాత మళ్లీ మంత్రి అయ్యేందుకు మంత్రి బాలినేని చేయని ప్రయత్నాలు లేవు. బాలినేని కంటే ఆయన వర్గం కూడా అదే స్థాయిలో ఒంగోలులో ప్రయత్నాలు చేసింది. అసమ్మతి రాజేసింది. ఈ క్రమంలోనే ఒంగోలులో మంత్రి బాలినేనిని తప్పించి యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలుపు సురేష్ కు మళ్లీ అవకాశం కల్పించడం పై ఒక రకంగా బాలినేని అనుచర వర్గం అవమానంగా భావించి కఛ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే బాలినేని కూడా విఫలయత్నాలు చేశారు. మళ్లీ అవకాశం కోసం రాజీనామా అస్త్రాన్నికూడా ప్రయోగించారు. ఈ క్రమంలోనే కొంత మంది అసంతృప్తి, అసమ్మతి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సీఎం జగన్ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాల సమాచారం,

బాలినేని గనక మెత్తపడకపోతే…

దాదాపు మూడు రోజుల పాటు జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బాలినేని చివరకు మెత్తబడి సీఎం జగన్మోహనరెడ్డిని కలిసి తిరిగి వచ్చి తానేమీ మంత్రి పదవి ఆశించలేదని, తనకు ఏమి అసంతృప్తి లేదని, తాను వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడునని, శ్రేయోభిలాషినని, రాజీనామాలను వెనక్కుతీసుకోవాలని అందరికీ చెబుతానని, పార్టీ బలోపేతం కోసం సిన్సియర్ గా పని చేస్తానని మీడియాతో చెప్పుకొచ్చారు. కానీ.. దీనికి ముందు కొన్ని అనూహ్యమైన నాటకీయ పరిణామాలే జరిగాయి. మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ మంత్రి పదవి విషయంలో వెనక్కు తగ్గక తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే మొదట్లో తెలిగ్గా తీసుకున్న సీఎం జగన్ వీళ్లు మెత్తబడారులే,,దారిలోకి వస్తారులే అని భావించారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డిలు రెండు మూడు సార్లు బాలినేనిని కలిసి ఒప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ బాలినేని మెత్తబడలేదు. ఆయన అనుచరులతో చర్చిస్తూనే ఉన్నారు. ఆయన అనుచరులు రాజీనామాలు వెనక్కుతీసుకోలేదు. పైగా బాలినేని కూడా ఇతర అసంతృప్తి ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. సో.. ఇక చివరి అస్త్రంగా సీఎం జగన్ ఓ షాకింగ్ ఆదేశం ఇచ్చారని సీఎం కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందు ఆ రోజు ఉదయం సీఎం జగన్ ఈ రోజు సాయంత్రానికి ఆ ఇద్దరు (బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత) మెత్తబడకపోతే వారి రాజీనామాలు ఆమోదించేయండి అని తన సన్నిహితులకు ఆదేశించినట్లుగా భొగట్టా. అయితే బాలినేని వంటి సీనియర్ నాయకుడి రాజీనామా ఆమోదిస్తే మరోలా ఉండేది. కానీ సీఎం మాత్రం సీరియస్ గానే తీసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఆలోచించారని తెలుస్తోంది. బాలినేని అదే అసమ్మతి, అదే అసంతృప్తిలో ఉంటే ఆయన రాజీనామాను ఆమోదించి ఒంగోలులో ఆయనకు ప్రత్యామ్నాయంగా మాగుంట లేదా వైవీ సుబ్బారెడ్డి ల వారసులను రంగంలోకి దించాలని ఆలోచించినట్లుగా కూడా సమాచారం. జిల్లా బాధ్యతలను కూడా వీళ్ల ఇద్దరి ద్వారా సమన్వయం చేసుకుని బాధ్యతలు అప్పగించాలని ఒ దశలో ఆలోచించినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి సన్నిహితులు కొందరు బాలినేనిని సర్దిచెప్పి దారిలోకి తీసుకువచ్చేందుకు చివరి ప్రయత్నంగా వెళ్లి మాట్లాడదామని సీఎం ను ఒప్పించి చివరి దశలో ఆ రోజు మధ్యాహ్నం బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చారని తెలుస్తోంది.

అందుకే మెత్తబడ్డారు

జరిగిన విషయం అంతా సీఎం జగన్ సీరియస్ నిర్ణయాలను మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా తెలుసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి..తన అనుచరులతో విషయం చర్చించి పార్టీ కోసం పని చేద్దాం అని నిర్ణయం తీసుకుని ఇక మెత్తబడి రాజీలోకి వచ్చినట్లుగా సమాచారం. అందుకే సీఎం జగన్ ను కలిసి వచ్చిన తరువాత ఆ విధంగా మాట్లాడారు. ఇక మేకతోటి సుచరిత రాజీనామా విషయం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. ఆమె రాజీనామాను ఆమోదించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వైసీపీ అనేది ఒక భిన్నమైన పార్టీ. సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్న పార్టీ. అటువంటి పార్టీ లో ఎవరు అగ్గిరాజేయాలని ప్రయత్నించినా, అసంతృప్తి, అసమ్మతి ఎక్కువ చేయాలని ప్రయత్నించినా జగన్ సహించే అవకాశం ఉండదు. అటువంటి వారికి అదును ఇచ్చే అవకాశం ఉండదు. అందుకే సీఎం జగన్ సీరియస్ నిర్ణయమే తీసుకుని దాదాపుగా రాజీనామాలు ఆమోదించే పనే చేశారు. కాని చివరి దశలో బాలినేని దారిలోకి రావడం, చర్చలు సఫలం అవ్వడంతో అంతా సర్దుబాటు అయ్యింది. బాలినేని మళ్లీ యధావిధిగా పార్టీ కోసం పని చేయడానికి తన వర్గానికి సర్దిచెప్పుకొని మంత్రి పదవి విషయంలో రాజీపడ్డారు అని తెలుస్తొంది.  సో.. ఇక మేకతోటి సుచరిత అంశమే మిగిలి ఉంది. ఆమె కూడా నేడో రేపో సీఎం జగన్ ను కలిసి సర్దుబాటు చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.    

Exit mobile version