TDP Prakasam: పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హోదా ఉంటుంది.. దర్పం పెరుగుతుంది.. దర్జా వస్తుంది… కొందరిలో దౌర్జన్యం కూడా ఆవహిస్తుంది..! కానీ అధికారం పోయిన తర్వాత ఇవన్నీ పోవడంతో పాటూ భయం ఆవహిస్తుంది..! దీనికి ప్రాక్టీకల్ గా కళ్ళెదురుగా కనిపిస్తున్న ఉదాహరణ జిల్లాలో 2014 – 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హోదా, దర్పం, దర్జా ప్రదర్శిస్తూ.. అక్కడక్కడా దౌర్జన్యాలకు కూడా దిగిన నాయకుల్లో కొందరు ఇప్పుడు పార్టీ మారిపోయారు.. కొందరు పాపాలు నాటి కడుక్కోడానికి, కొందరు స్థానిక పరిస్థితుల నేపథ్యంలో.. కొందరు అలిగి.., ఇలా రకరకాల కారణాలతో పార్టీలు మారారు. కొందరు నాడు వెలిగి, నేడు సైలెంట్ గా ఉన్నారు.. కొందరు ఎవరిపనిలో వారున్నారు..! ఇదే కోవలో ఇంకొందరు నాయకులు మాత్రం అప్పుడు, ఇప్పుడు ఒకేలా చనువు, చొరవతో ఉంటూ పార్టీలో పాజిటివ్ వైబ్రేషన్స్ తో రాజకీయాలు నడిపిస్తున్నారు..! వారిలోకే ఓ యువ నాయకుడు కూడా వస్తారు..!
జిల్లాలో ప్రస్తుతం టీడీపీకి మూడు సీట్లకు ఇంచార్జిలు లేరు.. ఆ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నప్పటికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది.. దర్శిలో తాత్కాలికంగా పమిడి రమేష్ రూపంలో ఇంచార్జిని పెట్టారు.. ఆయన ఏదో ఒకలా నెట్టుకొస్తున్నారు. అందరి ఐక్యతతో రెండు నెలల కిందట జరిగిన మున్సిపాలిటీ అయితే గెలుచుకున్నారు. ఇక చీరాలకి పెద్ద దిక్కు లేదు. అందుకే బాబు కూడా వేరే దిక్కులు చూస్తున్నారు.. కందుకూరు విషయంలో మాత్రం బాబు మైండ్ లో మూడు, నాలుగు పేర్లు తచ్చాడుతున్నప్పటికీ యువనేతకె ఇస్తే బాగుంటుందని బాబు దాదాపు ఫిక్సయినట్టు తెలుస్తుంది.. దామచర్ల వారసుడు, టీడీపీలో దశాబ్దం నుండి తెరవెనుక, ముందు సానుకూల రాజకీయాలు నడిపిస్తున్నారు. అందుకే కందుకూరు సీటుని దామచర్ల సత్యకే ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీనిలో లోలోపల అనేక కారణాలున్నాయి.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పలు కోణాలు, కారణాలు వెతుకుతారు, శోధిస్తారు, అన్ని రకాలుగా నమ్మకం కుదిరిన తర్వాతే సీటు అప్పగిస్తారు.. సత్య విషయంలో బాబుకి అలా గురి కుదరడానికి అనేక కారణాలు ఉన్నాయి..!!

TDP Prakasam: సత్య నిజంగా అర్హుడేనా..!?
కందుకూరు సీటు భిన్నమైనది. బీసీ ఓటింగ్ ఎక్కువ. భిన్నమైన వర్గాలు, కమ్మ ఓటింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, రెడ్డి సామాజికవర్గం కూడా బలంగా ఉంటుంది. వైసీపీ బలంగా ఉంది. ఎప్పుడో 1999లో టీడీపీ గెలిచిన తర్వాత మళ్ళీ టీడీపీ గెలవలేదు. టీడీపీ పునాదులు బలహీనపడ్డాయి. 2014లో వైసీపీ నుండి గెలిచి, టీడీపీలో చేరిన పోతుల రామారావు 2019లో దారుణంగా ఓడిపోయారు. తర్వాత ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత వ్యవహారాలు, వ్యాపార కారణాలతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆయన అనుభవం, ఆయన ఆరోగ్యం రీత్యా ఆయనకు వేరే బాధ్యతలు, తెరవెనుక బాధ్యతలు అప్పగించాలని బాబు యోచిస్తున్నారట..! మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కూడా బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ.. ఆయన తెరవెనుక కీలకంగా పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ ఇద్దరు మాజీల మద్దతుతో దామచర్ల సత్య అభ్యర్థి అయితే బాగుంటుందని పార్టీలో కీలక ముఖ్యనేతలు ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. సత్యకు జిల్లాలో ఏ నాయకుడితోనూ విబేధాలు లేవు. ఏ మాత్రం అహం లేదు. చొరవ, చనువు ఉంటుంది. సులువుగా అందరిలో కలిసిపోగలరు. యువకుల్లో యువకుడిగా, పెద్దోళ్ళలో పెద్దవాడిగా కలిసి రాజకీయం చేయగలరు.. అందుకే కందుకూరులో ఇద్దరు సీనియర్ల సహకారంతో సత్యకు టికెట్ ఇచ్చి గెలిపించాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. వేరే ఎవ్వరికి ఇచ్చినా ఈగోలు, గొడవలు, మనస్పర్థలు తప్పకపోవచ్చు.

TDP Prakasam: బాబు నమ్మకం గెలుచుకున్నట్టే..!?
పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా నాయకులు సైలెంట్ అయ్యారు. ఎవరి వ్యాపకాల్లో వారున్నారు. నియోజకవర్గాల్లో కూడా పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదు. చంద్రబాబు ఇటీవల నాయకుల పనితీరు, గత పనితీరు అన్నింటిపైనా కొన్ని నివేదికలు తెప్పించుకుని.. మొత్తం రివ్యూ చేశారు. దామచర్ల సత్య విషయంలో కొన్ని సానుకూలతలు కనిపించాయి. “2014 లో కొండపి, ఒంగోలు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపులో కీలకంగా పని చేయడం.., 2019లో కూడా వైసీపీ గాలిలో కూడా కొండపిలో గెలవడంతో కీలకంగా పని చేసారు. 2019 ఎన్నికలకు ముందు కొండపిలో అనేక వర్గాలు ఎమ్మెల్యే స్వామికి టికెట్ అవ్వవద్దు అంటూ అడ్డం తిరిగారు. వారిని సముదాయించి, దారిలోకి తెచ్చి, వారితో పని చేయించి.. సానుకూల ఫలితాలు రాబెట్టడంలో సత్య సక్సెస్ అయ్యారు. బ్రాండ్ ఉంది, పనితీరు బాగుంటుంది, పరిచయాలున్నాయి, చొరవ ఉంది, లౌక్యం ఉంది, తెరవెనుక, ముందు రాజకీయం చేయగల అసమర్ధత ఉంది..! అందుకే చంద్రబాబు కూడా దామచర్ల సత్యకు గడిచిన ఏడాది కాలంగా కొన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో ఒక మండలం బాధ్యతలు, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సమంగా సత్య పని చేసి, కొంత మేరకు సానుకూలత చూపించారు. ఆ నమ్మకంతోనే సత్యకి పార్టీలో కీలక పదవి కూడా అప్పగించారు. ఇన్ని సానుకూలతలతో సత్యకు కందుకూరు సీటు దాదాపు ఖరారైనట్టే చెప్పుకోవచ్చు..! కానీ…

మూడు వారి ముద్ర..! ఎలా నెట్టుకొస్తారో..!?
దామచర్ల కుటుంబానికి ఇప్పటికే ఒంగోలు ఉంది. కొండపి కూడా వారి చేతిలోనే ఉన్నట్టు లెక్క. ఇక మూడో సీటు కందుకూరు అంటే పార్టీలో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు. జనార్దన్ వేరు, సత్య వేరు.. రెండు వేర్వేరు కుటుంబాలు అనుకున్నా సత్యకు ఇప్పటికే కొండపి ఉంది. ఆర్ధికంగా అక్కడే మొత్తం వనరులు చూసుకోవాలి. ఈ క్రమంలో కందుకూరు సర్దుబాటు కష్టం కావచ్చు అనే ఆలోచనలు కొందరిలో ఉన్నాయి. అయితే.. కందుకూరులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, సత్యకి ఇప్పటికే అక్కడ ఒక టీమ్ ఉండడం.., పరిచయాలు ఉండడం.., వ్యాపార లావాదేవీలు కూడా ఆ నియోజకవర్గంతో ముడిపడి ఉండడం.., యువ కార్యకర్తల్లో ఫాలోయింగ్ ఉండడం.., సీనియర్లతో మంచి సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అంశాలు. అయితే ఎన్ని ఉన్నా కందుకూరు లాంటి సీటు ఆర్ధిక వనరులు ఎక్కువ అవసరమవుతాయి. దానికి కూడా తట్టుకుని… అసలు సత్యకు కందుకూరుపై ఆసక్తి ఉందా లేదా..!? కొండపి, కందుకూరు రెండు చూడగలరా..!? సెర్బుబాటు చేయలేరా..!? పార్టీ ఎంత మేరకు సపోర్ట్ ఇస్తుంది..!? అనే భిన్నమైన అంశాలు పరిశీలనలో ఉన్నాయి..!!