Wednesday, April 24, 2024
Home మా ఎడిటోరియల్ Prakasam TDP: సీఎంకి మరో లేఖ... టీడీపీ ఎమ్మెల్యేల కొత్త కాక..!!

Prakasam TDP: సీఎంకి మరో లేఖ… టీడీపీ ఎమ్మెల్యేల కొత్త కాక..!!

- Advertisement -

Prakasam TDP: జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు సీఎం జగన్ కి మరో లేఖ రాశారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకి అన్యాయం జరిగిందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామిల మరో లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై కొన్ని అభ్యంతరాలు.., జిల్లాకు జరిగే నష్టాలు తెలియజేస్తూ ఈ నెల 11న రాసిన లేఖపై వైసీపీ నుండి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు. ఇప్పుడు మరో లేఖ రాయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

“సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి…ప్రకాశం జిల్లా రైతాంగం, ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా ప్రజాపతినిధుల (గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి) వినతి..!

Prakasam TDP: MLAs Another Letter to CM
Prakasam TDP: MLAs Another Letter to CM
- Advertisement -

అయ్యా…!

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లాగా ప్రకాశం జిల్లా ఉన్నదనే విషయం మీకు విదితమే. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లా ప్రజానీకం, రైతాంగం ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం మీకు తెలిసిందే. ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటూ నెల్లూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు, మీ సొంత కడప జిల్లాలోని ఒక నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టుకి అన్యాయం చేయొద్దని.. ప్రకాశం జిల్లా కలలను చెరిపివేయొద్దని.. మీరు వెంటనే స్పందించాల్సిన, అత్యంత కీలకమైన సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం.

- Advertisement -

కేంద్ర జలశక్తి శాఖ నిన్న జారీ చేసిన గెజిట్ లో ప్రకాశం జిల్లాపై పెద్ద పిడుగు పడింది. వెలుగొండ ప్రాజెక్టుని అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించారు. ఇది విభజన చట్టానికి పూర్తి విరుద్ధం. ఈ సమస్యని సవివరంగా మీ దృష్టిలో పెడుతున్నాం. మీరు పరిష్కరిస్తారని మా ప్రజానీకం, మా రైతాంగం, మేము ఎదురు చూస్తున్నాం.. లేనిపక్షంలో వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తు కోసం ప్రజల పక్షాన నిలబడి ఎంతవరకైనా పోరాటానికి వెనుకాడమని హెచ్చరిస్తున్నాం..!

Prakasam TDP: జిల్లా ప్రజల గొంతులు తడారాయి..! (వెలుగొండని కేంద్రం గెజిట్ లో చేర్చండి)..!

తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన కృష్ణా, గోదావరి నదుల, నీటి ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుండి నిన్న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిట్ సారాంశం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న/ పూర్తయిన అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టంలో ఉన్నట్టు ఈ గెజిట్ లో పేర్కొన్నారు. ఇది 2014 నాటి విభజన చట్టానికి పూర్తి విరుద్ధం. విభజన చట్టంలోని 11 వ షెడ్యూల్, సెక్షన్ 85 (7ఈ)లో నీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంపై స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రాజెక్టులను (హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు) అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ నిన్న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టం జాబితాలో చూపించారు. “వెలుగొండ”ని వదిలేసారు. ఈ కీలకమైన ప్రాజెక్టుని “అనుమతిలేని ప్రాజెక్టు”గా “అన్ అప్రూవ్డ్” విభాగంలో చూపించారు. నాడు అన్ని అనుమతులున్నాయని, పూర్తి చేయాలనీ విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొని.., నేడు అసలు అనుమతులు లేవని ఆరునెలల్లోగా అనుమతులు తీసుకోవాలని గెజిట్ లో ఇచ్చారు. (విభజన చట్టంలో 11 వ షెడ్యూల్ చదవండి. నిన్న కేంద్రం జరీ చేసిన గెజిట్ చూడండి)..! దీని వలన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోనుంది. పాతికేళ్లుగా నిర్మాణంలో ఉండి.., ప్రాజెక్టు నిర్మాణం తుదిదశకు చేరుకున్న తరుణంలో ఇలాంటి చర్యల వలన లక్షలాది గొంతులకు, లక్షలాది ఎకరాలకు నీటి చుక్క అందక దుర్భిక్షం నెలకొంటుంది. ఇది కరువుతో కొట్టుమిట్టాడుతున్న ప్రకాశం జిల్లాకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. వెలుగొండపై ఆశలు పెట్టుకున్న మా జిల్లా ఎడారిగా మారుతుంది.

Prakasam TDP: MLAs Another Letter to CM
Prakasam TDP: MLAs Another Letter to CM

జిల్లా రైతుల గుండెలు బరువెక్కాయి..! (సీమ ఎత్తిపోతలపై పునరాలోచించండి)..!!

ముందుగా కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువభాగాన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు, ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న “రాయలసీమ ఎత్తిపోతల” నష్టాలను వివరిస్తూ ఈ నెల 11న మీకు ఒక లేఖ రాశాము. దానిపై ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. మరోసారి గుర్తు చేస్తూనే.., వెలుగొండ కీలక సమస్యని మీ దృష్టిలో పెడుతున్నాం. శ్రీశైలం వద్ద తెలంగాణ చేపట్టిన మూడు ప్రాజెక్టులు ద్వారా 14 వేల క్యూసెక్కులు పోతుంటే.., ఏపీ ప్రభుత్వం “రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వలన 80 వేల క్యూసెక్కులు నీరు పోతున్నాయి. ఆ ప్రాజెక్టు ద్వారా 805 అడుగుల వద్దనే నీటిని మళ్లించడం వలన వెలుగొండకు నీరుకి చేరే అవకాశమే లేదు. వెలుగొండ ద్వారా నీరు రావాలంటే కనీసం 850 అడుగుల నీటి మట్టం ఉండాలి. కానీ రాయలసీమ ఎత్తిపోతల మాత్రం 805 అడుగుల నీటిమట్టంలోనే 80 వేల క్యూసెక్కులు పోతున్నాయి. ఎగువ ప్రాంతంలోనే అడ్డగోలుగా నీటిని తోడేస్తే దిగువన ఉన్న నాగార్జున సాగర్ కి నీరు చేరక.. దేశంలోనే రెండో అతిపెద్ద నీటి ప్రాజెక్టుగా ఉన్న సాగర్ కేవలం ఒక టూరిజం కోసమే మిగులుతుంది. ఆ ప్రాజెక్టు దిగువన ఎడారిగా మారుతుంది. దీని వలన సాగర్ నీటినే నమ్ముకున్న ప్రకాశం జిల్లాలో సగం ప్రాంతం ఎడారిగా మారుతుంది. వర్షాల్లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయొద్దని మరోసారి చెప్పుకుంటున్నాం. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కేంద్రం నిన్న ఇచ్చిన గెజిట్ తో వెలుగొండపై మరో అతిపెద్ద పిడుగు పడింది. ఆ గెజిట్ చూసి మా రైతుల గుండెలు బరువెక్కాయి. వెలుగొండపై ఆశలు పెట్టుకున్న లక్షలాది బతుకులు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలోకి వెళ్లిపోయాయి.

జిల్లా రైతు కుటుంబాలు మౌనంగా రోదిస్తున్నాయి…! (న్యాయం చేయండి)..!!

సీఎం గారూ…! దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న టాప్ – 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. వర్షాభావ, కరువు పరిస్థితుల కారణంగా గడిచిన దశాబ్దం కాలంగా జిల్లాలో రైతుల బతుకులు తారుమారవుతున్నాయి. స్వేదం చిందించి, సేద్యం చేసే శక్తి ఉన్న రైతు కుటుంబాలు మౌనంగా రోదిస్తున్నాయి. ఖాళీ కడుపుతో వలసలు పోతున్నాయి. హలధారి కంట జలధార మంచిది కాదు. వారి కన్నీటిని తుడవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనపైనే ఉంది. అందుకే వెలుగొండ ఆశలు చిదిమేయొద్దు. నాగార్జున సాగర్ నీటిని దూరం చేయొద్దు. గడిచిన రెండు దశాబ్దాలుగా వర్షాల్లేక, నీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రాంతం మాది. మా జిల్లాలో 56 మండలాలుండగా 24 మండలాలు సాగర్ నీటిపైనా.., 24 మండలాలు వెలుగొండపైనా.., కొన్ని మండలాలు భూగర్భ జలాలపైనా ఆధారపడుతున్నాయి. సాగర్ నీరు అయిదేళ్లకో, ఆరేళ్లకో ఒకసారి మాత్రమే ఇస్తున్నారు. సాగర్ పరిధిలోని లక్షలాది మంది రైతులు భూములు బీడుగా వదిలేసి కూలీలుగా మారిపోయారు. వెలుగొండ నీరు వస్తే పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి తీరుతుందని ఏళ్ల తరబడి రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ సీమ ఎత్తిపోతల వలన ఒకరకమైన నష్టం వస్తుండగా.., నిన్న కేంద్రం గెజిట్ కారణంగా పూర్తిగా ప్రాజెక్టు మనుగడకే ముప్పు ఏర్పడింది. చూసీ, చూసీ అన్యాయానికి గురవుతుంటే రైతులు మౌనంగా ఉండలేరు. మౌన రోదన రైతులు ఎక్కువ కాలం భరించలేరు. మీరు వెంటనే స్పందించని పక్షంలో కరువు కడుపుల ఆకలి తీర్చని తప్పిదం చేసిన వారవుతారు. జిల్లా భవిత అగమ్యగోచరంగా మారితే చరిత్రలో మళ్ళీ ఈ తప్పుని సరిదిద్దుకోలేరు.

మా డిమాండ్లు :

  1. వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే కేంద్రం గెజిట్ లో చేర్చాలి. ప్రాజెక్టుకి అన్ని అనుమతులు ఉన్నాయని కేంద్రం సమక్షంలో మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా చూడాలి.
  2. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఇప్పటికే మీరు మాట మారుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లయినా ఇంకా పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుని ఎటువంటి ఆటంకాలు లేకుండా వెంటనే పూర్తి చేయాలి.
  3. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పునరాలోచించాలి. వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తుకి, నాగార్జున సాగర్ మనుగడకి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం చూసి, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులకు నీటిని అందించాలి.
- Advertisement -
RELATED ARTICLES

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు...

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు "అద్దంకి, పర్చూరు, చీరాల"పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Most Popular

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...