Friday, April 19, 2024
Home మా ఎడిటోరియల్ Giddaluru: "కన్నింగ్ పాలిటిక్స్" అంటే ఇవే..!? గిద్దలూరులో చేరికలు.. తెరవెనుక అదృశ్య హస్తం..!?

Giddaluru: “కన్నింగ్ పాలిటిక్స్” అంటే ఇవే..!? గిద్దలూరులో చేరికలు.. తెరవెనుక అదృశ్య హస్తం..!?

- Advertisement -

Giddaluru: రాష్ట్రంలో పంచాయతీ, స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలు ముగిసి ఏడాది కూడా గడవలేదు..! అధికార పార్టీ పట్ల ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, అందులోకి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో పెద్దగా వ్యతిరేకత ఏమి మొదలవ్వలేదు..! జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మొదటి నుండి బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పుంజుకోవడంలేదు..! అందులోకి 80 వేల పైచిలుకు తేడాతో ఓడిపోయిన గిద్దలూరు లాంటి చోట టీడీపీ నేతల్లో ఓటమి భయం, నైరాశ్యం, నిరాశ, నీరసం ఇంకా వీడలేదు..! అక్కడ టీడీపీ పూర్తిస్థాయిలో యాక్టీవ్ అవ్వాలంటే కనీసం మరో ఏడాది పడుతుంది..! ఇన్ని మెలికలున్నాయి – మతలబులున్నాయి. కానీ గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు 800 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారంటే ఎలా నమ్మబుద్ధవుతుంది..? ఎలా నమ్మశక్యంగా ఉంది..!? కానీ నమ్మాలి. చేరారు. ఆ చేరికలు నిజమే, కాకపోతే టీడీపీ చెప్తున్నట్టు మరీ 700, 800 ఉండకపోవచ్చు కానీ.. బాగా తక్కువ సంఖ్య ఉంటుంది. కానీ అందులో కొన్ని అంతర్గత రాజకీయాలు, కన్నింగ్ తరహా ప్రణాళికలు ఉన్నాయి..! టీడీపీ నాయకత్వంపై ప్రేమ కంటే.., వైసీపీ నాయకత్వంపై ద్వేషంతో తెరవెనుక కొన్ని హస్తాలు ఉండి నడిపించాయి. జిల్లాస్థాయిలో కొందరు నాయకుల ఆధ్వర్యంలో ఈ కథని నడిపించినట్టు అనుమానాలున్నాయి..!

Giddaluru: YSRCP Joinings in TDP Internal Facts
Giddaluru: YSRCP Joinings in TDP Internal Facts

Giddaluru: గిద్దలూరు టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి..!?

రాష్ట్రంలోనే రెండో అత్యధిక తేడాతో ఓడిపోయిన నియోజకవర్గంగా ఇక్కడి టీడీపీ గడించింది. అందుకు కొన్ని కారణాలున్నాయి. ఆ ఎన్నికల్లో చాలా అస్త్రాలు పని చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విపరీతమైన గాలి వీయడం.., అన్నా రాంబాబు సానుభూతి పలికించడం.., 2016లో అశోక్ రెడ్డి పార్టీ మారిన తర్వాత వర్గాలను పూర్తిస్థాయిలో కలుపుకోలేకపోవడం.., పశ్చిమ ప్రకాశంలో సంస్థాగతంగానే వైసీపీ బలం.. ఇలా అన్ని అంశాలు కలిసొచ్చి అన్నా రాంబాబు గెలిచారు. అయితే ఆయన తన గెలుపునకు న్యాయం చేయడం లేదు. అంత భారీ మెజారిటీ కట్టబెట్టిన నియోజకవర్గంలో ఈ రెండున్నరేళ్లలో రాంబాబు చేసిందేం లేదు. పైగా కొన్ని వివాదాలు, గ్రూపులు, సామజిక విబేధాలతో కొద్దిపాటి అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు.. అయితే అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. ఫలానా పనికి ఇంత తీసుకుంటున్నారు అనే మాట లేదు.. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఈ ఆరోపనలు ఎక్కువగా ఉన్నప్పటికీ.., గిద్దలూరులో లేవు. ఆయన వ్యక్తిగతంగా కొంత చెడ్డపేరు కూడా ఉన్నప్పటికీ.., ఇక్కడ ఒకేసారి వందల మంది నాయకులు అధికార పార్టీని వీడి.., టీడీపీలోకి వెళ్లాల్సినంత బలంగా ఆ పార్టీ(టీడీపీ) లేదు.

  • 2019 ఎన్నికల్లో భారీగా ఓడిపోయినప్పటి నుండి టీడీపీ శ్రేణులు బయటకు రావడం లేదు. అశోక్ రెడ్డి ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టి రమ్మన్నా.., వామ్మో..! ఎమ్మెల్యే చూస్తే కేసులు పెడతారేమో.., పాత వ్యవహారాలు లాగి ఇబ్బంది పెడతారేమోననే భయంతో చాలా మంది గ్రామస్థాయి/ మండలస్థాయి నాయకులు సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ భయంతో, అభద్రతాభావంతో, ఆత్మన్యూనత భావంతో కొట్టుమిట్టాడుతోంది. 2022 చివరి వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని ఆ పార్టీ పెద్దలు కూడా ఒక ప్రాధమిక అంచనాకు వచ్చారు. కానీ.. అనూహ్యంగా గత నెలలో వందల మంది నేతలు టీడీపీలో చేరడం ఒక పెద్ద విశేషమే.. కచ్చితంగా లోతుగా తెలుసుకోవాల్సిన విశేషమే.. ఆ పార్టీలోని వారే భయంతో ఉన్నవేళలో ఈ వందల మంది చేరి ఏం సాధిద్దామని..!? * సాధారణంగా అధికారాన్ని వదులుకుని ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడరు. గ్రామ/ మండలస్థాయిలో నాయకులైతే అధికారాన్ని ఒకస్థాయిలో అనుభవిస్తూ ప్రతిపక్షంలోకి వెళ్ళడానికి ఏ మాత్రం ఇష్టపడరు. కానీ గిద్దలూరులో వెళ్లారంటే.. అందులో వైసీపీకి చెందిన కొన్ని అదృశ్య శక్తులు బలంగా పని చేశాయి..!

టార్గెట్ అన్నా రాంబాబు.. మినిస్టర్ రాకుండా..!?

- Advertisement -

గిద్దలూరు నియోజకవర్గం అంటే రెడ్డి సామాజికవర్గం డామినేషన్. ఓటర్లు సంఖ్య పరంగా బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా రెడ్డి సామాజికవర్గం పట్టు ఎక్కువ. అక్కడక్కడా మాత్రమే కాపు సామాజికవర్గం ఉంటుంది. ఇక్కడ మొదటి నుండి అన్నా రాంబాబు అంటే “యాంటీ రెడ్డి” అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో చేరక ముందు నుండి అన్నా రాంబాబు వ్యతిరేకులకు ఈ ఆయుధం బలంగా ఉంది. అవన్నీ దాటుకుని రాంబాబు భారీ మెజారిటీ తెచ్చుకుని పార్టీ పెద్దల దృష్టిలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మరో రెండు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. దీనిలో భాగంగా జిల్లాలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇద్దరినీ తొలగించే అవకాశాలున్నాయి. మార్పుల్లో భాగంగా అన్నా రాంబాబు పేరు బాగా వినిపిస్తుంది. మెజారిటీ, సామాజికవర్గం, పశ్చిమ ప్రాంతానికి ప్రాతినిధ్యం.. ఇలా అన్ని అంశాలు కలిసొచ్చాయి. అయితే ఇక్కడే మెలిక, మతలబు ఉంది.!
“అన్నా రాంబాబు అంటే ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. తను అనుకున్నది నిక్కచ్చిగా మాట్లాడేస్తారు. మొహమాటాలు లేకుండా కుండబద్ధలు కొట్టేలా మాట్లాడేస్తారు. కొంతమంది నాయకులకు లొంగరు (అందుకే 2016 నుండి అధికార టీడీపీపై పోరాటం చేసి.., పార్టీ నుండి బయటకు వచ్చారు)..! అటువంటి వ్యక్తికీ మంత్రి పదవి ఇస్తే జిల్లాలో కొందరు ముఖ్య నాయకులకు కష్టమే. జిల్లాలో రెండున్నరేళ్లుగా వారు చేసిన కొన్ని వ్యవహారాలు బయటకు వచ్చినా వస్తాయి.. పైగా నియోజకవర్గంలోని, జిల్లాలోని కొందరు కూడా రెడ్డి సామాజికవర్గం నేతలు రాంబాబుపై గుర్రుగా ఉన్నారు.. పార్టీ పెద్దలకు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.. అన్నా రాంబాబుకి వ్యతిరేకంగా ప్రతీరోజూ ఏదో ఒక అంశాన్ని ఉన్నవీ, లేనివి కలిపి పెద్దలకు చెప్తున్నారు.. సో.. ఈ క్రమంలో “గిద్దలూరులో రాంబాబుపై బీభత్సమైన వ్యతిరేకత ఉంది.. అక్కడ పార్టీ మునిగిపోతుంది.. అక్కడ ఏదో జరిగిపోతుంది” అనే బూచిని చూపించాలంటే/ ఫోకస్ చేయాలంటే.. పార్టీ పెద్దలకు రాంబాబుపై వ్యతిరేకత పెంచాలంటే.., అతనికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన పోగొట్టాలంటే.., ఇదిగో ఇలా భారీ పార్టీ మార్పులకు శ్రీకారం చుట్టాలి.. అందుకే అదే చేశారు. దీనిలో జిల్లా స్థాయిలో ఓ అదృశ్య శక్తి కథని నడిపించగా.., ఆ నియోజకవర్గంలోని నేతలు కథని అమలు చేశారు. ఫైనల్ గా రాంబాబుకి వ్యతిరేకంగా “టీడీపీలోకి వందలాది వెళ్లడం” అనే కార్యక్రమాన్నీ అమలు చేసారు.

- Advertisement -
RELATED ARTICLES

YSRCP: ఆ పాపం చెరిసగం..! గ్రానైట్ కోసం గొడవ.. ఆ నేతలు VS అధికారులు..!?

YSRCP: అనగనగా.. ఓ గ్రామం.. ఆ గ్రామానికి శివారున ఎస్టీలు నివసించే ప్రాంతం.. ఆ ప్రాంతం భూగర్భాన విలువైన గ్రానైట్ నిక్షేపాలు...

Darsi Politics: పేస్ కాలేజీ కుర్రాళ్ళ “పవన్నినాదం” వ్యూహమేనా..!? దర్శిలో “రెండు పార్టీల్లో” కొన్ని క్లైమాక్స్ ట్విస్టులు..!?

Darsi Politics: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం అంటే అందరి చూపు "అద్దంకి, పర్చూరు, చీరాల"పైనే ఉంటుంది.. కానీ దర్శి, కొండపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో కనిపించని సైలెంట్ మార్పులు...

Addanki Politics: అద్దంకిలో ఎవరికి ఎవరు శత్రువు..!? కొత్త వ్యూహంతో కృష్ణ చైతన్య..!

Addanki Politics: కరణం వర్గానికి - గొట్టిపాటి, బాచిన రెండు వర్గాలతో శత్రుత్వం ఉంది. కుటుంబ పరమైన ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో గొట్టిపాటికి చేసారు. ఇప్పుడు కరణం...

Most Popular

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...