Monday, January 30, 2023
Home వార్తలు పీఎస్ లోనే వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు ..రిమాండ్ తరలింపుకు సన్నాహాలు.. ఇంటి వద్ద విజయమ్మ...

పీఎస్ లోనే వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు ..రిమాండ్ తరలింపుకు సన్నాహాలు.. ఇంటి వద్ద విజయమ్మ నిరసన

- Advertisement -

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపును ఇచ్చి నిన్న ద్వంసమైన కారులోనే బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారు నుండి దిగకపోవడంతో క్రేన్ సాయంతోనే ఆమెతో సహా కారును ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఆమె పై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలియడంతో షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ బ్రదర్ అనిల్ మండిపడ్డారు.

మరో పక్క షర్మిల అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిలతో పాటు మరో అయిదురు వైఎస్ఆర్ టీపీ నాయకులను రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేశారు. పీఎస్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్ పేట వైద్యలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది సేపటిలో షర్మిలతో సహా ఆ పార్టీ నేతలను మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హజరు పర్చనున్నారు. కాగా షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి, దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నుండి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేశారు. పోలీస్ అధికారులతో విజయమ్మ వాదనకు దిగారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ విజయమ్మ తన ఇంటి గేటు వద్దే భైటాయించారు. తన కుమార్తెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారనీ, తన కుమార్తెను చూసేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికే తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారనీ, ఇంటికి తీసుకువచ్చే వరకూ గేటు వద్దే కూర్చుంటానని తెలిపారు.

- Advertisement -

షర్మిల ఎక్కడా పరుష పదజాలం వాడలేదనీ, విమర్శిస్తే సమాధానం చెప్పాలి కానీ దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని విజయమ్మ అన్నారు. ప్రజల నుండి షర్మిలను ఎవరూ వేరు చేయ్యలేరని అన్నారు. ఆడబిడ్డపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారని అన్నారు. మరో పక్క షర్మిల అరెస్టుపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధకల్గించే అంశమని అన్నారు. ఇదిలా ఉంటే షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిన్న వరంగల్లు జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా పోలీసులు నిలువరించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ పంపించారు. దీంతో ఈ రోజు వైఎస్ఆర్ టీపీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన కోర్టు పలు ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయవద్దని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

Most Popular

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...