Thursday, April 25, 2024
Home వార్తలు YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

- Advertisement -

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ గా ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలికి పార్టీ ఇన్ చార్జిగా నియమించారు. అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైపోయింది. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఎవరికి ఇస్తారు అనేది చర్చ జరుగుతోంది. ఈ జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, లేదా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంలలో ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తారని అనుకుంటున్నారు. అయితే తమ్మినేని సీతారామ్ పార్లమెంట్ కు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.

Granite YSRCP: Internal Issue with Granite

స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆముదాలవలస నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం 19983 నుండి తమ్మినేని సీతారామ్ క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. మంచి వాగ్దాటి పటిమ, నాయకత్వ లక్షణాలతో నియోజకవర్గం నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఎదిగారు. టీడీపీ నుండి పీఆర్పీకి, ఆ తర్వాత వైసీపీ పార్టీలు మారారు అనే అపవాదు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో ఒక సారి, పీఆర్పీ నుండి ఒక సారి , వైసీపీ నుండి మరో సారి మొత్తం నాలుగు సార్లు ఆయన పరాజయం పాలైయ్యారు. టీడీపీ హయాంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రజారాజ్యం నుండి 2009లో పోటీ చేసిన సమయంలో దాదాపు 30వేలకుపైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి అయిదువేల ఓట్ల తేడాతో ఆయన బావమరిది టీడీపీ అభ్యర్ధి కోన రవికుమార్ చేతిలో ఓటమి పాలైయ్యారు. గత ఎన్నికల్లో 13వేలకుపైగా మెజార్టీతో రవికుమార్ పైనే విజయం సాధించారు. సీనియారిటీ హోదాలో మంత్రి పదవిని తమ్మినేని ఆశించినప్పటికీ ప్రతిపక్షంపై దూకుడుగా వ్యవహరించే స్వభావం, సీనియారిటీ, వాగ్దాటి, వివిధ అంశాలపై లోతైన అవగాహన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జగన్ ఆయనకు స్పీకర్ స్థానానికి ఎంపిక చేశారు.

- Advertisement -

అయితే ఆముదాలవలస నియోజకవర్గం నుండి గత ఎన్నికల సమయంలోనే రేస్ లో ఉన్న సువ్వారి గాంధీ.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. స్పీకర్ తమ్మినేనితో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు, పార్టీ శ్రేణులకు సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలను పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు, సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ పరిణామం తమ్మినేనికి కొంత ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నియోజకవర్గంలో వివిధ సామాజికవర్గాలు ఉన్నప్పటికీ కళింగ సామాజికవర్గానిదే రాజకీయ ఆధిపత్యం. సువ్వారి గాంధీ సతీమణి దివ్య నియోజకవర్గంలో అతి పెద్ద మండలానికి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఇంతకు ముందు ఎన్నికైయ్యారు. పొందూరు మండలం టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. వైసీపీ అవిర్భావం తర్వాత మొట్టమొదటి సారిగా వైసీపీ ఎంపీపీగా దివ్య ఎన్నికైయ్యారు. సొంత మండలంలో పట్టు సాధించిన తర్వాత సువ్వారి నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో క్యాడర్ ను పెంచుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితుడుగా పేరుంది. గత ఎన్నికల సమయంలోనే జగన్ సువ్వారి గాంధీకి వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లుగా ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఆ వాదనలు బలం చేకూరేలా గాంధీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో తమ్మినేని నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం రాకపోయినా పార్టీ ముఖ్యనేతలు, రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో జరిగే పార్టీ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో గాంధీకి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుతున్నాయని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు తమ నాయకుడికే టికెట్ ఇస్తారనే దానికి సంకేతాలు అని గాంధీ మద్దతుదారులు భావిస్తున్నారు.

- Advertisement -

ఓ పక్క టికెట్ దక్కించుకునేందుకు సువ్వారి గాంధీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా,. తమ్మినేని సీతారామ్ నియోజకవర్గంలో తన రాజకీయ ఆధిపత్యం చేజారకుండా ఉండేందుకు తన వారసుడికి టికెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అందుకే పలు పార్టీ కార్యాక్రమాల్లో తన కుమారుడిని భాగస్వామిని చేస్తున్నాడుట. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజల్లో మంచి మార్కులు సాధించిన వారికే టికెట్ ఇస్తానని చెబుతున్నారు. సర్వే నివేదికల్లో ప్రతికూలంగా వస్తే ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా పక్కన బెట్టి వేరే వాళ్లకు టికెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. గత గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్షలో వెనుకబడిన నియోజకవర్గాల జాబితాలో అముదాలవలస కూడా ఉందని చెప్పారని ప్రచారం జరుగుతోంది. జగన్ సర్వే లో ఎవరికి అనుకూలంగా రిపోర్టు వస్తుంది. తమ్మినేనికి మరో సారి అవకాశం ఇస్తారా.. లేక గత హామీ మేరకు సువ్వారికి అవకాశం ఇస్తారా అనేది తేలాలి అంటే అదనపు ఇన్ చార్జిల నియామకాలు జరిగే వరకూ ఆగాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

Most Popular

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...