Thursday, April 18, 2024
Home వార్తలు Ongole MP TDP: భారీ ప్లాన్ వేసిన టీడీపీ..! ఎంపీ అభ్యర్థిగా వైసీపీకి ధీటైన నేత!?

Ongole MP TDP: భారీ ప్లాన్ వేసిన టీడీపీ..! ఎంపీ అభ్యర్థిగా వైసీపీకి ధీటైన నేత!?

- Advertisement -

Ongole MP TDP: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలవడం అతి కష్టమైన స్థానాలు ఒక అయిదు ఆరు వరకూ ఉంటాయి..! కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు ఈ తరహాలోనే ఒంగోలు కూడా వస్తుంది. రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎస్సీ, బీసీ, కాపు, కమ్మ ఈ సామాజికవర్గ ఓట్లు ఎక్కువే. కానీ గత కొన్ని దశాబ్దాల నుండి ఒక 1999లో కరణం బలరామ కృష్ణమూర్తి తప్ప చాలా వరకు రెడ్డి సామాజికవర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. ఇవి దృష్టిలో పెట్టుకుందో ఏమో..! తెలుగుదేశం పార్టీ ఈ సారి అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడా సామాజిక సమీకరణాలు తూచ తప్పకుండా పాటించే దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నాయకత్వ సమస్య లేదు. అభ్యర్ధినీ వెతుక్కునే పని లేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సిద్దంగా ఉంటారు లేదంటే ఆయన తనయుడు రాఘవరెడ్డి పోటీకి రెడీగా ఉన్నారు. వాళ్లు కాకపోతే మరో నాయకులు అయినా సిద్దంగా ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చే సరికి 1999 నుండి కూడా ఒక్కొ ఎన్నికకు ఒక్కో కొత్త అభ్యర్ధి వస్తూ పోటీ చేస్తూ ఓడిపోతూ ఉంటున్నారు. సో.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంత కంటే వేరేగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఇదే సమయంలో..

Ongole MP TDP: ఈ సారి పక్కా స్కెచ్ వేసిన టీడీపీ మిస్ అవ్వకూడదని ..?!

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కఛ్చితంగా అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో గనక ఆ పార్టీ ఓడిపోతే పార్టీకి కార్యకర్తలు తప్ప నాయకులు ఎవ్వరూ మిగలరు. సో.. నాయకులు పార్టీలో ఉంటేనే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటుంది. సో.. నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇది ప్రత్యేకంగా చెప్పే విషయం ఎమి కాదు. అందు చేతనే పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో అర్ద అంగ బలాలను బేరీజు వేసుకుని చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తొంది. సో.. అందుకే గెలుపు కష్టమైన ఒంగోలు పార్లమెంట్ ను కొట్టాలి అంటే..? ఖచ్చితమైన అభ్యర్ధి ఉండాలి అని నారా లోకేష్, చంద్రబాబు సహా పార్టీ పెద్దలు అందరూ ఒ నిర్ణయానికి వచ్చారు. అందుకే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మంచి పరిచయాలు ఉండి, ఆర్ధికంగా బలోపేతంగా ఉంటూ క్లీన్ ఇమేజ్ ఉన్న ఒ నేతను అన్వేషించారు. ఆయన ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపిగా పోటీ చేయబోతున్నారు అనే పుకార్లు కొన్ని రోజుల నుండి వస్తున్నాయి. పార్టీ వైపు నుండి ఆయనకు అన్ని విధాలా పార్టీ క్యాడర్ ను కనెక్ట్ చేసి, నాయకులను కనెక్ట్ చేసి ఆయన్ను ఎంపిగా చేయించి ఆయనకు కావాల్సిన అండదండలు అన్నీ ఇవ్వడానికి పార్టీ ఆయనతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఆయన రిస్క్ చేస్తారా..? పోటీకి దిగుతారా..? ఇంకా ఏమైనా కండిషన్లు పెడతారా..? అనేది వేచి చూడాల్సి ఉంది. ఇంతకూ ఆయన ఎవరంటే..?

Ongole MP TDP: తూమాటి వెంకట నర్సింహరెడ్డి పోటీ చేస్తారా..?

- Advertisement -

తూమాటి వెంకట నర్శింహరెడ్డి. ఈ పేరు రాజకీయ వర్గాలకు కొత్త కావచ్చు. కానీ వైసీపీలో అంతర్గత నాయకులకు, తెలుగుదేశం పార్టీలో అంతర్గత నాయకులకు ఓ స్థాయి వరకూ తెలుసు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఓ ప్రముఖ స్థాయిని సంపాదించుకున్న తూమాటి వెంకట నర్శింహరెడ్డి పుట్టింది, పెరిగింది అంతా కొండెపి నియోజకవర్గంలోని మర్రెపూడి మండలంలోని గుండ్లసముద్రం గ్రామంలోనే. కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్ వెళ్లి వ్యాపార రంగంలో స్థిరపడి అక్కడి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులతో భాగస్వామిగా భారీగా ప్రాజెక్టు లు చేపట్టి సక్సెస్ అయిన వ్యాపారవేత్తగా వెంకట నర్శింహరెడ్డి ఉన్నారు. ఆయనకు రాజకీయాల పట్ల కూడా ఆసక్తి ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన తెరవెనుక రాజకీయ పనులు చేస్తూనే ఉన్నారు. పార్టీల అవసరాల మేరకు సహకరిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనూ కీలకంగానే పని చేశారుట. ఆయన వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు అని ఒక వార్త. పార్టీ పెద్దలు కూడా ఆయనను పిలిపించి మాట్లాడారు అని, పార్టీ నేతలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని, అయన కూడా సానుకూలంగా స్పందించారని, సో.. ప్రస్తుతానికి అంతర్గతంగా ఈ చర్చలు ఒ కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తొంది. నిజంగా ఆయన పోటీకి దిగితే మాత్రం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఓ మంచి అడుగు వేసినట్లే చెప్పుకోవచ్చు. కాకపోతే ఒంగోలు పార్లమెంట్ టీడీపీ గెలవడం అంత సులువు కాదు. ఆర్ధికంగా వైసీపీలో బలమైన నేతలు ఉన్నారు. వారిని ఢీకొట్టి, ఆర్ధిక బలాలను కూడా వారికి ధీటుగా ప్రయోగించాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు సాధ్యపడదు. అందుకే ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో.. వెంకటనర్శింహరెడ్డి పోటీలోకి వస్తే పరిస్థితి మారుతుంది. ఆయన పోటీ చేయకపోతే మళ్లీ టీడీపీ కొత్త వెతుకులాట ప్రారంభిస్తుంది. సో.. ఏమి జరుగుతుంది అనేది క్లారిటీ రావాలంటే ఈ డిసెంబర్ నెలాఖరు వరకూ ఆగాల్సిందే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...

Most Popular

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...

నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3...