Thursday, April 25, 2024
Home వార్తలు డిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు మాదిరి ఏపీలోనూ ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి - ఏలూరి

డిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు మాదిరి ఏపీలోనూ ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలి – ఏలూరి

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ఏ విధంగా విచారణ జరుపుతుంతో అదే విధంగా ఏపిలో గత 40 నెలలుగా జరుగుతున్న అక్రమ మద్యం మాఫియాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తంతోనే ఏపితో పాటు దేశ వ్యాప్తంగా మద్యం మాఫియా సాగుతోందని ఆరోపించారు. మద్యం మాఫియా అక్రమ సంపాదన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న కంపెనీలకు చెందిన వ్యక్తులు ఏపిలో అక్రమ మాఫియాలో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ని అరెస్టు చేశారనీ, ఆ కంపెనీలో సి ఎఫ్ ఓ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఆడాన్ డిస్క్లరీ పేరుతో ఏపిలో మద్యం వ్యాపారం చేస్తున్నారని ఏలూరి అన్నారు. ఏపిలో మద్యం మాఫియాపై విచారణ జరిపి ఆ వ్యక్తులను అరెస్టు చేయాలని ఏలూరి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మద్యం అక్రమ వ్యాపారాలు సాగించిన వారందరినీ ప్రభుత్వం జైలు పాలు చేస్తుందని చెప్పారు. మద్య పాన నిషేదం అంటూ గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి ఈ అరెస్ట్ ల వ్యవహారంపై ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని ఏలూరి కోరారు. ఎన్నికల ప్రచారంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేదం అని మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారన్నారని ఏలూరి విమర్శించారు. కల్తీ మద్యంతో వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నారని ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...