Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హజరు కాని ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులతో ఫోన్ సంభాషణలు జరిపిన, పరోక్ష ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ నేత తుషార్, కేరళకు చెందిన జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ లను విచారణకు హజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేయగా, ఈ నెల 21న (నిన్న) విచారణకు శ్రీనివాస్ తప్ప మిగిలిన వారు హజరుకాలేదు.

జగ్గుస్వామికి నోటీసులు ఇచ్చేందుకు కేరళకు వెళ్లిన పోలీసులకు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆశ్రమ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలు  హజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సిట్ .. వీరిపై లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేసింది. న్యాయవాది శ్రీనివాస్ ఈ రోజు మరో మారు సిట్ విచారణకు హజరైయ్యారు.

వీరికి సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులో విచారణకు హజరుకాకపోతే 41 – ఏ (3), (4) సిఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణ అధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసుపై బీజేపీ హైకోర్టు ఆశ్రయించగా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ సంతోష్ ను అరెస్టు చేయవద్దని సిట్ ను న్యాయస్థానం ఆదేశించింది.

Exit mobile version