Friday, September 30, 2022
Home వార్తలు సీనియర్ తెలుగు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఇకలేరు

సీనియర్ తెలుగు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఇకలేరు

- Advertisement -

సీనియర్ తెలుగు సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి చెందిన విషయం తెలియడంతో ఆయన సోదరుడి కుమారుడు ప్రముఖ హీరో ప్రభాస్ తో ఇతర బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. రేపు ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1966లో చిలకా గోరింక సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 187 చిత్రాల్లో కృష్ణంరాజు విభిన్న పాత్రల్లో నటించారు. చివరిసారిగా రాథేశ్యామ్ లో నటించారు. ఆయనకు భార్య శ్యామలాదేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సినీ రంగం నుండి 1998 లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాకినాడ లోక్ సభ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుండి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికై అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009 ఎన్నికలకు ముందు బీజేపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజా రాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన కృష్ణంరాజు తొలి సారి పరాజయం చవిచూశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపాలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...