Home వార్తలు ఏపి లోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఏపి లోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఏపి కి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి రాబోయే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

ధ్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అధికారుుల తెలిపారు. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. మంగళవారం వరకూ సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Exit mobile version