Thursday, September 29, 2022
Home వార్తలు బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ – 2 నిర్యాణం

బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ – 2 నిర్యాణం

- Advertisement -

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ (96) కన్నుమూశారు. కొంత కాలంగా వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఎలిజిబెత్ 2 భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. స్కాట్లాండ్ లోని బాల్ మోరల్ ప్యాలెస్ లో చికిత్స పొందుతున్న రాణి మరణ వార్తను ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు అంతా ముందుగానే స్కాట్లాండ్ లోని రాణి నివాసానికి చేరుకున్నారు. రాణి ఎలిజిబెత్ భౌతిక కాయాన్ని శుక్రవారం బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నట్లు తెలిపారు. రాణి మరణంతో బ్రిటన్ శోకసముద్రంలో మునిగిపోయింది. బ్రిటన్ ను అత్యధిక కాలం పరిపాలించిన రాణిగా ఎలిజిబెత్ 2 గుర్తింపు పొందారు.

1922 లో జన్మించిన జన్మించిన ఆమె పిలిప్ మౌంట్ బాబెన్ ను 1947 లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయసులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబ చరిత్రలో అత్యధిక కాలం రాణి గా కొనసాగారు. రాణి 70 ఏళ్లు సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. రాణి మరణంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ నూతన రాజుగా, 14 కామన్ వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. రాజు, రాణి (చార్లెస్, కెమిల్లా) శుక్రవారం లండన్ చేరుకుంటారు అని బర్మింగ్ హోమ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. రాణి మరణం దేశానికి, ప్రపంచానికి తీరని లోటని చార్లెస్, ప్రధాని లిజ్ ట్రస్ అభివర్ణించారు. ఆమె మరణం పట్ల పలు దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఎలిజిబెత్ 2 మరణంతో ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రజలకు, రాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రిటన్ రాణి పోరాట యోధురాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ట్విటర్ లో తెలిపారు. 2015-16 లో బ్రిటన్ రాణితో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకున్న మోడీ.. తన పట్ల ఆమె చూపిన ప్రేమ కరుణను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తన వివాహ సమయంలో మహాత్మా గాంధీ బహుమతిగా ఇచ్చిన చేతి రుమాలను బ్రిటన్ రాణి చూపించారని ఆయన వెల్లడించారు. రాణి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు.  

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...