Home వార్తలు President Election: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదల..జూలై 18న పోలింగ్..21న కౌంటింగ్

President Election: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదల..జూలై 18న పోలింగ్..21న కౌంటింగ్

 

President Election: భారత రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేశారు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెల 15న జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 15వ తేదీ నుండి 29 తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తామనీ, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. జూలై 2వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా చెప్పారు. జూలై 18న పోలింగ్, 21న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 25లోగా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా షెడ్యుల్ ను ఖరారు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జరుగుతాయని చెప్పారు. పోలింగ్ మాత్రం పార్లమెంట్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణలో జరగనున్నట్లు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. ఎన్నికలకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని రాజీవ్ కుమార్ వివరించారు.

Exit mobile version