Wednesday, April 24, 2024
Home వార్తలు Kondapi News: ప్రజల హృదయాల్లో చిరంజీవి దామచర్ల..!!

Kondapi News: ప్రజల హృదయాల్లో చిరంజీవి దామచర్ల..!!

- Advertisement -

Kondapi News: కొండపి నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన దివంగత నాయకుడు దామచర్ల ఆంజనేయులు ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు సెంటర్ వద్ద గురువారం దామచర్ల 92వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని వివరించారు. దామచర్ల చూపిన బాటలో నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. దామచర్ల మనుమడు, స్థానిక టీడీపీ నాయకుడు దామచర్ల సత్యనారాయణ (సత్య) మాట్లాడుతూ తన తాత చూపిన బాటలోనే తమ కుటుంబం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. తొలుత నేతలు దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం అభిమానులు, కార్యకర్తలకు అల్పాహారం పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

Most Popular

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...