Friday, March 29, 2024
Home వార్తలు KCR: డోంట్ ఫియర్ ఐ యాం హియర్ .. ధాన్యం రైతాంగానికి కేసిఆర్ భరోసా ప్రకటన

KCR: డోంట్ ఫియర్ ఐ యాం హియర్ .. ధాన్యం రైతాంగానికి కేసిఆర్ భరోసా ప్రకటన

- Advertisement -

KCR: యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటామని తెలిపారు. క్వింటాల్ రూ.1960లు చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ, ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుండి యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు కేసిఆర్. రైతులు తక్కువ ధరలకు ధాన్యం విక్రయించుకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన కేబినెట్ లో ధాన్యం కొనుగోలుపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

- Advertisement -

గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది.  బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన నిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.  సీఎం కేసిఆర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ వడ్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్న కారణంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కేబినెట్ భేటీ అనంతరం కేసిఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...