Friday, September 30, 2022
Home వార్తలు Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

- Advertisement -

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా బలహీనంగా మార్చుకుంటున్న నియోజకవర్గాల్లో కందుకూరు మొదటి వరుసలో ఉంటుంది..! నిజానికి కందుకూరు నియోగాజకవర్గంలో ఉన్న క్యాడర్, అభిమానులు, సామజిక బలంతో టీడీపీ అక్కడ వరుసగా గెలుస్తూ ఉండాలి.. కానీ కొందరి గుత్తాధిపత్యం.. నేను, నేను అంగీకరించిన వాళ్ళు గాక ఇంకెవ్వరూ పెత్తనానికి రాకూడదు, గెలవకూడదు అనుకునే ధోరణి అక్కడ బలహీనంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 50 వేల వరకు ఓటర్లు ఉన్న కమ్మ సామాజికవర్గం పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చెలాయించే ఈ నియోజకవర్గంలో.., బీసీ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువ. ఈ రెండు వర్గాలూ తెలుగు దేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుదన్నుగా నిలిచేవే.. కానీ ఇక్కడ వరుస ఓటములు తప్పడం లేదు..! సరైన నాయకత్వం లేక, ఉన్న ఒకరి ఇద్దరి గుత్తాధిపత్య ధోరణి కారణంగా ఈ నియోజకవర్గం వరుసగా ఓడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఇన్ చార్జి విషయంలో జరుగుతున్న అంతర్గత గొడవ కూడా టీడీపీని టెన్షన్ పెడుతోంది.

ఇన్ చార్జి కోసం ఆది నుండీ వివాదాలే..!?

కందకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ప్రస్తుతం ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఈయన భార్య గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బడేవారిపాలెం గ్రామంలో సర్పంచ్ గా పని చేశారు. నాగేశ్వరరావుకు అర్ధబలం, అంగ బలం బాగానే ఉన్నాయి.. కాకపోతే నోటి దురుసు, చుట్టూ సొంత బృందం కారణంగా కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ పెద్దల దృష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తుంది..! అయితే ఇంచార్జి గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని విధాలుగా, అన్ని వర్గాల్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కొన్ని మైనస్ లు దాటలేకపోతున్నారు. కానీ ఈయనకు..

  • ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఆపత్కాలంలో ఆదుకున్న ఇంటూరి రాజేష్ వర్గం ఇక్కడ బలంగానే ఉంది. 20202 మొదట్లోనే పార్టీ కోసం, క్యాడర్ కోసం, నాయకుల కోసం అన్ని విధాలుగా రాజేష్ అండగా నిలబడ్డారు. సొంత డబ్బు ఖర్చు చేశారు. స్థానిక ఎన్నికల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇన్ చార్జి పదవి ఇవ్వనప్పటికీ పార్టీకి అవసరాల్లో ఆదుకున్న ఇంటూరి రాజేష్ కి పార్టీ అన్యాయం చేస్తొందన్న అందోళన ఆయన వర్గీయుల్లో కనిపిస్తొంది. సో.. ఇప్పుడు ఇంటూరి వారి సోదరుల మధ్య ఏర్పడిన చిన్న పాటి గ్యాప్ పార్టీలో పెద్ద గ్యాప్ గా మారి పార్టీని ప్రమాదంలోకి నెట్టేసిందని చెప్పవచ్చు.
  • 2019 ఎన్నికల ముందు వరకూ సాదాసీదా నాయకుడిగా పని చేసిన ఇంటూరి రాజేష్.. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఇన్ చార్జిగా ఎవరూ ముందుకు రాని సమయంలో అండగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా వయసు, ఆరోగ్య రీత్యా, అధికార పార్టీ కేసుల దృష్ట్యా సైలెంట్ అయిన నేపథ్యంలో ఇంటూరి రాజేష్ పార్టీ బాధ్యతలను తనపై వేసుకున్నారు. దారాళంగా ఖర్చు చేశారు. స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి చిన్ని స్థాయి నాయకులకు భరోసా ఇచ్చారు. చాలా మందికి ఆర్ధిక సహకారాలను అందించి వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఆయన చేసిన మంచి ఇప్పటికీ కూడా ఆయన వెంట అండగా నిలిచింది. అందుకే ఇంటూరి రాజేశ్ కే ఇన్ చార్జి బాధ్యతలు ఇస్తే బాగుంటుంది అని ఆయన వర్గం భావిస్తొంది. కానీ..
  • ఇంటూరి నాగేశ్వరరావు వర్గం కూడా అదే స్థాయిలో పని చేస్తొంది. ఇన్ చార్జి ఇచ్చిన తర్వాత పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో కూడా పని చేస్తొంది. కాకపోతే ఇన్ చార్జి పదవి ఇచ్చిన తర్వాత చురుకు అవ్వడం వేరు. ఎటువంటి పదవి లేకుండా పార్టీని ఆపత్కాలంలో ఆదుకోవడం వేరు. సో..ఇంటూరి రాజేష్ పార్టీ పెద్దల వద్ద కొన్ని మంచి మార్కులే వేయించుకున్నారు. కాకపోతే ఈ నియోజకవర్గ రాజకీయాన్ని, తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయాలను శాసిస్తున్న కొన్ని పెద్ద తలకాయలు ఇన్ చార్జి విషయంలో తలదూరుస్తున్నట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి అంతా స్తబ్దుగానే ఉన్నప్పటికీ కొద్ది రోజుల్లోనే కందుకూరు నియోజకవర్గ టీడీపీ అంతర్గత విషయాలు పార్టీకి తలనొప్పిగా లేకపోలేదు. పోతుల రామారావు వర్గం కూడా ఆయనే పోటీ చేయాలని భావిస్తొంది. ఇంటూరి నాగేశ్వరరావు అనుకూల వర్గం ఎంత బలంగా ఉందో వ్యతిరేక వర్గం కూడా అలానే ఉంది. ఇంటూరి రాజేష్ కి అదే పరిస్థితి. అందుకే పోతుల రామారావు వస్తే సౌమ్యుడు, వివాద రహితుడు, సీనియారిటీ అన్నీ పార్టీకి ఉపయోగపడతాయని పార్టీ పెద్దలకు కొంత మంది సమాచారం ఇస్తున్నారు. సో..రాజేష్ యువకుడు కాబట్టి ఆయన విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారా..? లేక రామారావునే యాక్టివ్ చేసి ఆయనకే కేటాయిస్తారా? లేదా, ఇంటూరి నాగేశ్వరరావునే కొనసాగిస్తారా..? అనేది కాస్త ప్రస్తుతానికి అనుమానమే!
- Advertisement -
RELATED ARTICLES

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...