Home వార్తలు Home guard Cheating: ఈ మహిళా హోంగార్డు తెలివితేటలు మామూలుగా లేవుగా..! ఏకంగా డీజీపీ, ఎస్పీ...

Home guard Cheating: ఈ మహిళా హోంగార్డు తెలివితేటలు మామూలుగా లేవుగా..! ఏకంగా డీజీపీ, ఎస్పీ సంతకాలనే ఫోర్జరీ చేసి..!!

Home guard Cheating: పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ మహిళా హోంగార్డును ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.  ఆమె చేసిన నిర్వాకం చూసి పోలీసులే అవాక్కు అయ్యారు. విషయం ఏమిటంటే…చెట్ల వాణి అనే మహిళ ఒంగోలు ఎస్పీ కార్యాలయంతో పాటు పలు పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులను నిర్వహించింది. తనకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయనీ, హోంగార్డు పోస్టులు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద రూ.5లక్షలు వసూలు చేసింది. వారికి నకిలీ నియామక పత్రాలు అందించింది.

దీనిపై బాధితులు ఒంగోలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆమె బండారం వెలుగు చూసింది. జిల్లా ఎస్పీ మలిక గార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరగా కీలక విషయాలు వెలుగుచూశాయి. హోంగార్డుగా పని చేస్తున్న వాణి…ఏకంగా ఏపీ డీజీపీ, జిల్లా ఎస్పీ ల పేరుతో లెటర్ హెడ్‌లు, నకిలీ స్టాంపులతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు హోంగార్డు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని భారీ స్కెచ్ వేసింది. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ తయారు చేసేందుకు డీటీపీ, స్టాంపుల తయారు చేసే మరో నలుగురిని తన బృందంలో వాణి చేర్చుకుంది. వీరి ద్వారా ఏపి డీజీపీ, జిల్లా ఎస్పీ ల పేరుతో లెటర్ హెడ్ లు, నకిలీ స్టాంపులతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసింది. ఈ వ్యవహారం బయటపడటంతో వాణితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలిక గార్గ్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను జైలుకు తరలించడం జరిగిందన్నారు.

Exit mobile version