Friday, September 30, 2022
Home వార్తలు Breaking: సాలూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు

Breaking: సాలూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు

- Advertisement -

Breaking: పార్వతీపురం మన్యం జిల్లా లో భారీ పేలుడు సంభవించింది. సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించడంతో పట్టణం ఒక్కసారి ఉలిక్కిపడింది. పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన బాణాసంచా కు నిప్పు అంటుకోవడం వల్ల ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తొంది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ గోడలు బీటలు వారాయి. పక్కనే ఉన్న షెడ్డు రేకులు ఎగిరిపడ్డాయి. పేలుడు సంభవించడంతో పోలీస్ స్టేషన్ నుండి సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

గ్రామం మొత్తం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో ప్రజలు ఏమి జరిగిందో తెలియక భయాందోళనకు గురైయ్యారు. విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ వద్దకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వల్ల ఎంత నష్టం వాటిల్లింది, ప్రమాదం ఎలా జరిగింది తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో సీజ్ చేసిన బాణాసంచాను పోలీస్ స్టేషన్ లో భద్రపర్చినట్లు తెలుస్తొంది.

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...