Thursday, April 18, 2024
Home వార్తలు నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

- Advertisement -

అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలులోని కిచెన్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా గూడురు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును గూడూరు రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసి అధికారులకు సమచారం అందించారు.

రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో కిచెన్ బోగీ సగానికిపైగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలును గంట పాటు నిలిచిపోయింది. ఎగిసి పడుతున్న మంటలు పక్క బోగీలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదనీ, ఆస్తినష్టం మాత్రమే జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...

Most Popular

నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3...