Thursday, September 29, 2022
Home వార్తలు లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

- Advertisement -

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్ అక్కడ నుండి తెలంగాణకు తాకి అక్కడ పార్టీల్లో తీవ్ర కలకలాన్ని రేపి ఏపి రాజకీయాలను తాకింది. అయితే ఈ రోజు ఈడీ చేస్తున్న సోదాలు అధికార పార్టీ ప్రజా ప్రతినిధి (ఎంపీ)ని కాస్త ఇబ్బంది పెట్టేలానే ఉన్నాయి. ఢిల్లీలోని ఆయన కార్యాలయంతో పాటు చెన్నైలోని ఆయన కార్యాలయంతో పాటు నెల్లూరులోనూ ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇంకా అధికారికంగా ఈడీ వెల్లడించలేదు కానీ సదరు ఎంపీకి చెందిన కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు ప్రాధమిక సమాచారం. అధికార పార్టీ ఒంగోలు ఎంపీకి చెందిన ఢిల్లీ కార్యాలయంలో ఈడీ సోదాలు జరుగుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన మొదట్లోనే ఏపికి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. కొన్ని పత్రికల్లోనూ వార్త రాగా ఆయన అప్పట్లోనే ఖండించారు. తమకు లిక్కర్ స్కామ్ తో ఏమీ సంబంధం లేదు. తాము నిబంధనలకు విరుద్దంగా ఏమీ చేయలేదు, కొన్ని దశాబ్దాల కాలంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నాము, ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించలేదు, అంతా పారదర్శకంగానే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ వ్యవహారం చల్లారింది.

- Advertisement -

అయితే ఆయన (మాగుంట) ఒంగోలు ఎంపీ అయినప్పటికీ ఎక్కువగా ఢిల్లీ, చెన్నై, నెల్లూరులో ఉంటూ ఉంటారు. ఆయన మీద ఆరోపణలు రావడం, ఈడీ ఈ రోజు నెల్లూరు, చెన్నై, ఢిల్లీలో సోదాలు జరుగుతుండటంతో కొంత సీరియస్ నెస్ కనబడుతోంది. ఆయన ఏమైనా ఈ స్కామ్ లో ఇరుక్కుంటారా అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మాగుంట శ్రీనివాసరెడ్డి చాలా తెలివైన, చురుకైన వ్యాపారి, రాజకీయ నాయకుడు. ఆయన అంత ఊజీగా తప్పుకు దొరికే టైపు కాదు అనే వాళ్లు ఉన్నారు. ఆయన వివాద రహితుడు, సౌమ్యుడుగా పేరుంది. ఆయనకు రాజకీయాల్లో శతృవులు లేరు. ఆయన కాంగ్రెస్ నుండి టీడీపీ లో చేరిన సమయంలో గానీ ఆ తర్వాత టీడీపీ నుండి వైసీపీలో చేరినప్పుడు కానీ ఆయన పాత పార్టీలను గట్టిగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. ఆయనకు రాజకీయాల్లో శాశ్వత శతృవులు అంటూ ఉండరు అంటారు.

- Advertisement -

ఈ సామర్థ్యాల కారణంగా ఒక పదిహేను రోజుల్లోనే ఈ వివాదం నుండి బయటపడతారని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై వివరణ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుమానాల నివృత్తి కోసం ఈడీ సోదాలు చేసుకున్నారు, చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్నాము కాబట్టి ఈడీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ స్కామ్ లో ఆయనకు చెందిన పాత్ర ఏమైనా ఉంటే ఈడీ గానీ సీబీఐ గానీ నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో ఈడీ గానీ సీబీఐ గానీ అంత త్వరగా ప్రెస్ రిలీజ్ చేసే అవకాశం ఉండదు. ప్రస్తుత వ్యవస్థల్లో ఉన్న లొసుగులు, రాజకీయాల నేపథ్యంలో ఇది పెద్ద సెన్షేషనల్ కేసు అవుతుందని భావించాల్సిన అవసరం లేదు.    

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...