Home వార్తలు వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వాళ్లు జైలులోనే ఉన్నారు. మరో పక్క ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ నుండి పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని తులశమ్మ ఆరోపించారు. మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని సీబీఐని తులశమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ఆర్ధిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయనీ, ఆ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు.

వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రసాద్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, రాజశేఖరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తులశమ్మ కోరారు. తులశమ్మ గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొమ్మిది నెలల తర్వాత కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా పులివెందుల కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకరరెడ్డి కడప జైలులోనే ఉన్నారు. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.

Exit mobile version