Wednesday, April 24, 2024
Home వార్తలు CORONA: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం..!నాలుగు రోజుల వ్యవధిలో 76 మందికి కరోనా

CORONA: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం..!నాలుగు రోజుల వ్యవధిలో 76 మందికి కరోనా

- Advertisement -

CORONA: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నెల 16వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి వారం రోజుల్లో ఎటువంటి కేసులు నమోదు కాలేదు, కానీ 24వ తేదీ నుండి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24న 35 మంది, 25న 18 మంది, 26న 11 మందికి, 27న ఎడుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో 28 మంది విద్యార్ధులు, 48 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.  

- Advertisement -

ఉలవపాడు మండలం వీరేపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్, వెలిగండ్ల మండలం వెదుల్లచెరువు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్, డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో, అటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవన్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాఠశాలల్లో కరోనా కేసుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు వివరించారు. పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పక్కా గా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ కేసులు నమోదైన పాఠశాలలను విద్యాశాఖ అధికారులు సందర్శించి వివరాలు టాస్క్ ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

Most Popular

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...