Friday, April 19, 2024
Home వార్తలు CM Jagan: రెండు మూడు రోజుల్లో ఉద్యోగులకు గుడ్ న్యూస్..

CM Jagan: రెండు మూడు రోజుల్లో ఉద్యోగులకు గుడ్ న్యూస్..

- Advertisement -

CM Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో 13 ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై పిఆర్‌సీతో సహా తమ డిమాండ్ లను తెలియజేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను సీఎం జగన్ మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని తెలిపిన జగన్..అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదన్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పదంతో ఉండాలని జగన్ కోరారు. . ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న తపనతో ఉన్నామని పేర్కొన్నారు. ఫిట్ మెంట్ విషయంలో అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపి జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపి జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

Most Popular

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...