Friday, March 29, 2024
Home వార్తలు పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

- Advertisement -

పల్నాడు జిల్లాలోని వంకాయలపాడు లో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐటీసీ గ్లోబల్ స్పెసెస్ యూనిట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ యూనిట్ లో 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఈ యూనిట్ వల్ల వేల మంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పారు. రెండవ దశ పూర్తి అయితే అతి పెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన రాష్ట్రంలోనే ఉంటుందన్నారు. 24 నెలల్లో ఈ యూనిట్ ను ఐటీసీ పూర్తి చేసిందన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని స్పెసిస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలోనే ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.3450 కోట్లతో ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ యూనిట్ల ద్వారా 33వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో పది యూనిట్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయని తెలిపారు. వీటి వల్ల రైతుల పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తదుపరి సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్య కళాశాలకు చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు విడతల రజిని, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...