Home వార్తలు ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు – చంద్రబాబు

ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు – చంద్రబాబు

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ లో వైసీపీ నేతలు శ్మశానం కబ్జా చేశారంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వందకుపైగా మృతదేహాలను పూడ్చిన ఆ శ్మశానాన్ని వైసీపీ నేతలు దుక్కిదున్ని మినుము పంట సాగు చేస్తున్నారంటూ పత్రికలో వచ్చిన కథానాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన చంద్రబాబు.. ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు పడ్డాయి అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.

వైసిపి స్థానిక నేతలు సమాధులను తవ్వేసి స్మశానాన్ని కబ్జా చేస్తే… అధికారులంతా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి అన్నారు చంద్రబాబు. కనీసం ఉన్నతాధికారులు అయినా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కబ్జాదారులపై చర్యలకు దిగాల్సి ఉందని పేర్కొన్నారు.