Friday, September 30, 2022
Home వార్తలు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు జైలు శిక్ష, జరిమానా విధించిన సీబీఐ కోర్టు

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు జైలు శిక్ష, జరిమానా విధించిన సీబీఐ కోర్టు

- Advertisement -

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో రూ.42 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ రుణాల పేరుతో బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారు అయ్యింది. ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి రామకోటేశ్వరరావుకు అయిదేళ్లు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు.

మాజీ ఎంపీ గీతకు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కు జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో గీతతో సహా ఇతర నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు తెలంగాణ హైకోర్టులో ఆమె తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  

- Advertisement -

కొత్తపల్లి గీత 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంట్ కు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత 2018లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ తర్వత జనజాగృతి పేరిట రాజకీయ పార్టీ నెలకొల్పారు. అనంతరం ఆమె బీజేపీలో చేరి తన పార్టీని కూడా అందులో విలీనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...