Friday, April 19, 2024
Home వార్తలు Budda Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు.. మంత్రి జోగి కౌంటర్

Budda Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు.. మంత్రి జోగి కౌంటర్

- Advertisement -

Budda Venkanna: టీడీపీ నేత,  మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ నాయకులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుద్దా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విజయవాడలో బుధవారం బుద్దా వెంకన్న పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. చంద్రబాబు భారీ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కొంత మంది చెత్త వాగుడు వాగుతున్నారు. వారికి ఇదే హెచ్చరిక అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామనీ, అనవసరంగా నోరు పారేసుకుంటే చావడానికైనా.. చంపడానికైనా  సిద్ధమని అన్నారు. నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బుద్దా వెంకన్న.

- Advertisement -

చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయన్న భ్రమలో వైసీపీ నేతలు ఉన్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీనియర్ లను కాదని జోగి రమేష్ కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని ఆ పార్టీ నేతనే అంటున్నారన్నారు. బుద్దా వెంకన్న చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బుద్దా వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు జోలికి ఎవరు వెళతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజల్లో ఆయనకు బుద్ది చెప్పి పక్కన పెట్టేశారన్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు చంద్రబాబుని కూడా ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. పుట్టిన రోజున నాడు వేడుకలు చేసుకోవాలని గానీ ఈ పిచ్చి మాటలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

Most Popular

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...