Friday, September 30, 2022
Home వార్తలు Balineni Srinivasa Reddy: బాలినేని పై కుట్రలు ఎవరెవరి పని..!? ప్రకాశం వైసీపీలో శత్రువుల.. !?

Balineni Srinivasa Reddy: బాలినేని పై కుట్రలు ఎవరెవరి పని..!? ప్రకాశం వైసీపీలో శత్రువుల.. !?

- Advertisement -

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తన పార్టీలోనే తనకు శత్రువులు ఉన్నారనీ, తనపైన కుట్ర జరుగుతోందనీ, తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనీ, తన కుమారుడి మీద కూడా అవినీతి బురద చల్లుతున్నారనీ, వాళ్లందరి సంగతి తేలుస్తాననీ, తాను తప్పు చేశాననీ నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాననీ ఇలా సంచలన కామెంట్స్ చేశారు. ఒంగోలులో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సొంత పార్టీలో శత్రువులు ఉన్నారా..? ఉంటే ఎవరు..? ఎందుకు శత్రువులు అయ్యారు..? బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా కామెంట్స్ చేయడంలో అంతరార్ధం ఏమిటి..? తెరవెనుక ఏమి జరుగుతుంది. ఈ జిల్లాలో ఆయనతో ఎవరెవరికి శత్రుత్వం ఉంది..? ఎందుకు ఉంది..? వాళ్లు అలా చేస్తున్నారా..? నిజంగా బాలినేని వెనుక కుట్ర జరుగుతుందా..? దీనిలో బాలినేని స్వయంకృతాపరాధాలు ఏమైనా ఉన్నాయా..? అనే విషయాలను పరిశీలిస్తే…

వైవీ సుబ్బారెడ్డితో తీవ్ర విభేదాలు

బాలినేని శ్రీనివాసరెడ్డి 2019 కు ముందు ఒకలా, 2019 అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా ఉన్నారు. ఇది అందరూ అనుకుంటున్న మాట. అధికారంలోకి వచ్చిన తరువాత శత్రువులను మరింతగా పెంచుకున్నారు. బాలినేనికి తెలిసి జరిగినవి కొన్ని అయితే తెలియక జరిగినవి కొన్ని ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో తన దూర్చి రాజకీయ శత్రువులను అయితే తయారు చేసుకున్నారు. ఈ జిల్లాలో బాలినేనికి సొంత బావ అయిన వైవీ సుబ్బారెడ్డితో ఆయనకు పడదు అన్న సంగతి అందరికీ తెలుసు. వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి..? నిన్న బాలినేని తన వెనుక కుట్ర జరుగుతుందని, దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నదానిలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఉందా అన్న అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. అసలు వీరి ఇద్దరి మధ్య విభేదాలు 2014 ఎన్నికల తరువాత వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా వచ్చాయి. 2014 ఎన్నికల్లో బాలినేని ఎమ్మెల్యేగా ఓడిపోగా, వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపిగా గెలిచారు. బాలినేని పార్టీ జిల్లా కన్వీనర్ గా ఉన్నప్పటికీ అంత యాక్టివ్ గా లేరు. పార్టీని అంతగా పట్టించుకోలేదు. 2019 ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు బాలినేని యాక్టివ్ అయ్యారు. బాగా తిరిగారు. అంతకు ముందు వరకూ నెలకు ఒక సారి రెండు సార్లు జిల్లాకు వచ్చి వెళ్లేవారు. ఇదే క్రమంలో ఎంపిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. కార్యకర్తలను చూసుకున్నారు. పాదయాత్ర చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పోరాడారు. చాలా కార్యక్రమాలు నిర్వహించారు. బాలినేని ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదు. తానే పట్టించుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి అయ్యేది బాలినేని అన్న అభిప్రాయం వైవీ సుబ్బారెడ్డిలో అప్పటి నుండే ఉంది.

మూడేళ్లుగా నియోజకవర్గ రాజకీయాలకు దూరం

- Advertisement -

దానికి తోడు 2019 ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ రాలేదు. టీడీపీ నుండి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు. మాగుంట వైసీపీలోకి రావడానికి, ఎంపీ టికెట్ రావడానికి బాలినేని కారణమన్న భావన వైవీ సుబ్బారెడ్డిలో ఉంది. అప్పటికే వాళ్లిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండగా, తనకు రావాల్సిన ఎంపీ టికెట్ రాకపోవడంతో దానికి కారణం బాలినేని అన్న భావన ఏర్పడటంతో వీరి మద్య మనస్పర్ధనలు మరింత పెరిగాయి. వాళ్లిద్దరి మధ్య ఎంత గ్యాప్ పెరిగింది అంటే … వైసీపీ అధికారంలోకి వచ్చి బాలినేని మంత్రి అయిన తరువాత వైవీ సుబ్బారెడ్డిని తన సొంత నియోజకవర్గం (ఒంగోలు)లోకి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఈ మూడేళ్లలో రెండు సార్లు మాత్రమే వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు వెళ్లారు. ఒంగోలు నియోజకవర్గ రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకోవద్దన్న కండిషన్ బాలినేని పెట్టారు అన్న పుకారు ఉంది. వైవీ సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో వేలు పెడితే తన ఆధిపత్యం దెబ్బతింటుందని బాలినేని ఆ కండిషన్ పెట్టారని అనుకుంటుంటారు. పార్టీ అధికారంలోకి వచ్చినా తన అనుచర వర్గానికి ఏమి చేసుకోలేని పరిస్థితి వైవీ సుబ్బారెడ్డికి ఏర్పడింది. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడుగా చేసిన వైవీ సుబ్బారెడ్డికి నియోజకవర్గంలో పెద్ద అనుచర వర్గం ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి పోయింది. ఇప్పుడు జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి హవా మొదలైంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయనేది బాలినేని వర్గం ఆరోపణ.

Balineni Srinivasa Reddy: ఎంపీ మాగుంటతోనూ..

- Advertisement -

ఇక జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డితోనూ గ్యాప్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇద్దరు కలిసే ప్రచారం చేశారు. కలిసే పని చేశారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధతలు ఏర్పడ్డాయి. మాగుంట కూడా సీనియర్ నాయకుడు. వీరి కుటుంబానికి జిల్లాలో పట్టు ఉంది. అనుచర వర్గం ఉంది. మాగుంట పెత్తన సాగితే తన ఆధిపత్యం దెబ్బతింటుందన్న భావనతో బాలినేని జిల్లా మొత్తం తన కంట్రోల్  లో ఉంచుకున్నారు. అందుకే మాగుంట వర్గానికి పదవులు దక్కలేదు. పనులు జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎంపీ మాగుంట సిపార్సు లేఖలు చెల్లుబాటు కాలేదు. ఈ విభేదాల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో మాగుంట సీరియస్ గా ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటునకు మాగుంట వర్గం సర్వం సిద్ధం చేసుకోగా రాత్రికి రాత్రి మాగుంట కోవిడ్ కేర్ సెంటర్ కాస్తా బాలినేని కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది. అదే సమయంలో మాగుంట తన ట్రస్ట్ తరపున రిమ్స్ ఆసుపత్రికి పీపీఈ కిట్స్, బెడ్స్ అందజేస్తే వాటిని వాడకుండా స్టోర్ రూమ్ లో పడేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్ ను వీరు కలిసి ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో ప్రధానమైన రైల్వే వంతెన సమస్యపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే కార్పోరేషన్ అధికారులు ఎవరూ రాలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఒకరిని మీటింగ్ కు పంపించారు. మాగుంటకు విలువ లేకుండా పోయిందని ఆయన వర్గం ఆరోపణగా ఉంది.

Balineni Srinivasa Reddy: సీఎం జగన్ జోక్యం చేసుకుంటేనే..
- Advertisement -

బాలినేని, వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉంటుంది. అదే మాగుంట, బాలినేని మద్య మనస్పర్ధనలు సమసిపోవాలంటే వారిద్దరు కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం అవుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాటిపోయింది. వాళ్లిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలని భావించినా వారి వారి అనుచర వర్గం కుదరనిచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తోనూ బాలినేనికి గ్యాప్ ఉంది. బాలినేని ప్రమేయం లేకుండా విజయసాయిరెడ్డి ద్వారా ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్, దుగ్గుబాటి వెంకటేశ్వరరావులు వైసీపీలో చేరారు. పర్చూరు నుండి పోటీ చేసిన దగ్గుబాటి, చీరాల నుండి పోటీ చేసిన ఆమంచి ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. పర్చారు, చీరాలలో వైసీపీ ఓటమికి బాలినేని పాత్ర ఉంది అనేది వారి అనుచరుల అనుమానం. ఎన్నికల తరువాత దగ్గుబాటి సైలెంట్ అయిపోయారు. ఆమంచి మాత్రం తాను పార్టీ లో ఉండి పోరాడతానని కూర్చున్నారు. టీడీపీ నుండి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాంను పార్టీలోకి తీసుకురావాడంలోకి తీసుకురావడంలో బాలినేని కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత చీరాల పార్టీలో ఆమంచి పెత్తనం సాగకూడదు, కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్ పెత్తనం సాగాలని బాలినేని భావించారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.

ఆమంచితోనూ

కరణం బలరాం కూడా బాలినేనికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ చీరాల మున్సిపల్ ఎన్నికల్లో ఆమంచి వర్గీయులు 11 మంది రెబల్ గా పోటీ చేసి కౌన్సిలర్ లుగా గెలిచారు. ఆ తరువాత కూడా  ఏ విషయంలోనూ తగ్గకుండా ముందుకు సాగుతున్నారు ఆమంచి. మరో పక్క ఆమంచికి పర్చూరు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం ఆలోచన చేయగా బాలినేని అడ్డుకున్నారు. అడప దడపా బాలినేని, ఆమంచి లు సీఎం జగన్ ను కలిసిన సందర్భాల్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇలా బాలినేనికి వైవీ సుబ్బారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ లతో విభేదాలు ఉండటంతో పాటు మరి కొన్ని నియోజకవర్గాల్లో శత్రువులు తయారు అయ్యారు. దర్శిలో వైసీపీ లో రెండు వర్గాలు ఉంటే ఒక వర్గానికి బాలినేని సపోర్టు చేస్తున్నారు. అలానే కొండెపి, కందుకూరు సహా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నేతలతో బాలినేనికి గ్యాప్స్ ఉన్నాయి. బాలినేనికి ఇప్పుడు మంత్రి పదవి లేకపోవడంతో ఒంటరి అయ్యారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఆయనకు అధికారం లేకపోవడంతో శత్రువులు అందరూ ఏకమయ్యి పావులు కదిపే పరిస్థితులు వచ్చాయి. మంత్రిగా ఉన్న సమయంలో బాలినేని వ్యవహరించిన తీరే ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయని అంటున్నారు.           

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...