Thursday, April 25, 2024
Home వార్తలు Balineni: బాలినేనికి అసంతృప్తి లేదు(ట)..! జగన్ తో భేటీ అనంతరం వెల్లడి..!!

Balineni: బాలినేనికి అసంతృప్తి లేదు(ట)..! జగన్ తో భేటీ అనంతరం వెల్లడి..!!

- Advertisement -

Balineni: తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గంలోకి బాలినేనిని తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైయ్యారనీ, రాజీనామాకు సిద్దమయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఈ రోజు బాలినేనితో సమావేశమైయ్యారు. ఒంగోలులో బాలినేని అనుచరులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేటి నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి బాలినేని దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో జగన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు నేతలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని జగన్ తో సమావేశమైయ్యారు. సుమారు గంట పాటు జగన్ తో భేటీ కొనసాగింది. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

తనకు ఎటువంటి అసంతృప్తి లేదని బాలినేని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తాము వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ కు విధేయులమని పేర్కొన్నారు. రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ యే బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆదిమూలపు సురేష్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కలిసి పని చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ సీపీదేనని అన్నారు. సజ్జల, తాను ప్రతి వారం కలుస్తూనే ఉంటామనీ అలానే నిన్న ఈరోజు కలిశారనీ, అందులో ప్రత్యేకం ఏమిలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో గతంలో వచ్చిన స్థానాలకంటే ఎక్కువగా వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ నెల 22వ తేదీన ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉందని దానిపై చర్చించినట్లు బాలినేని తెలిపారు.

- Advertisement -

బాలినేని మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఒంగోలు పట్టణంలో నిన్న రాత్రి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం కూడా చేశారు. పార్టీ కార్యాలయం వద్ద జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

Most Popular

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...