Thursday, September 29, 2022
Home వార్తలు రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డూ..రికార్డు ధరతో లడ్డూను దక్కించుకున్న స్థానికుడు

రికార్డు బ్రేక్ చేసిన బాలాపూర్ గణేష్ లడ్డూ..రికార్డు ధరతో లడ్డూను దక్కించుకున్న స్థానికుడు

- Advertisement -

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటలో ఈ ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఒకరైన లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ.5లక్షల70వేలు అదనంగా ఈ సారి ధర లభించింది. బాలాపూర్ గ్రామ సెంటర్ లోని బొడ్రాయి వద్ద జరిగిన ఈ వేలం పాటలో స్థానికులతో పాటు స్థానికేతరులు పాల్గొన్నారు. లడ్డును సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డిని గణేష్ మండపం నిర్వహకులు శాలువాతో సత్కరించారు. లడ్డూ దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ప్రస్తుతం లడ్డూను కొనుగోలు చేసిన మేరకు ఆ డబ్బును వచ్చే ఏడాది ఇదే రోజున చెల్లిస్తానండూ కమిటీ సభ్యులకు బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు.  

వేలం పాటలో బాలాపూర్ గణేష్ లడ్డూ గత 27 ఏళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటోంది. 1994లో రూ.450 లతో మొదలైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట.. రాష్ట్రాంలో ఎక్కడాలేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. వేలంలో లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరి సంపదలతో పాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. స్థానికేతరులు సైతం పాటలో పాల్గొని వేలంలో లడ్డూను దక్కించుకుంటున్నారు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ నిర్వహకులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు.

- Advertisement -

2001 వరకూ బాలాపూర్  లడ్డూకు వేలంలో వేలల్లోనే ధర పలకగా, 2002లో కందాడ మాధవరెడ్డి లక్షా 5వేల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుండి అయిదేళ్ల పాటు లక్ష, ఆ తరువాత రెండు లక్షలు పెరుగుతూ 2015లో ఏకంగా పది లక్షలు దాటి రికార్డు సృష్టించింది. 2021లో రూ.18లక్షల 90వేలకు ఏపికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఆయన స్నేహితుడు మర్రి శశాంక్ రెడ్డి (నాదర్గుల్) చేజిక్కించుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.5లక్షల 70 వేలు పెరిగింది. ఈ సారి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు లక్ష్మారెడ్డి వేలంలో రూ.24లక్షల 60వేలకు దక్కించుకున్నారు.   

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...

Most Popular

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...