Thursday, September 29, 2022
Home వార్తలు Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

- Advertisement -

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా రాజధానిగా మారుతుందని మంత్రి గుడివాడ అమరనాథ్ రీసెంట్ గా స్పష్టం చేశారు. త్వరలో వికీంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతున్నట్లు కూడా చెప్పారు. ఆ తరుణంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపి మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టు చెంతకు చేరింది. గతంలో ఏపి హైకోర్టు తీర్పును ఏపి సర్కార్ సుప్రీంలో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన అయిదు నెలల తర్వాత ఇప్పుడు ఏపి ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ ఏడాది మార్చి మొదటి వారంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మూడు రాజధానుల అంశంపై స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయాలని పేర్కొంది. మూడు రాజధానుల ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఆనాడు హైకోర్టు తీర్పు రాకముందే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే మెరుగైన వికేంద్రీకరణ బిల్లు తీసుకువస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ స్వయంగా చెప్పారు. మూడు రాజధానులకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుందని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఏపి సర్కార్ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయడం సంచలనంగా మారింది.

- Advertisement -

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమే అవుతుందని ఏపీ సర్కార్ పేర్కొంటోంది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని పిటిషన్ లో ఉదహరించింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు చేస్తున్నామని పిటిషన్‍లో పేర్కొంటూ హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపి సర్కార్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

లిక్కర్ స్కామ్ లో మాగుంట ఇరుక్కున్నట్లేనా..!? చిక్కుల్లో ఒంగోలు ఎంపీ.. కానీ ట్విస్ట్ ఉంది

మన దేశ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుదిపేస్తొంది అన్నది అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా ఏపి రాజకీయాలను కూడా లిక్కర్ స్కామ్ కుదిపేసింది. ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్...

Most Popular

Kandukuru TDP: పెద్దల ఆలోచనల్లో మార్పు!? ఇంఛార్జి కుర్చీ..!?

Kandukuru TDP: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త క్లిష్టంగా, కష్టంగా మారిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..! వరుస వివాదాలు, వర్గాలు, విభేదాల కారణంగా పార్టీలో ఉన్న బలాన్ని కూడా...

Breaking: సుప్రీం కోర్టు చెంతకు చేరిన ఏపి మూడు రాజధానుల అంశం

Breaking: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేయాలన్న కృత నిశ్చయంతోనే ఉంది. వచ్చే ఏడాది నుండే విశాఖలో పరిపాలనా...