Home వార్తలు రాజదాని మాస్టర్ ప్లాన్ సవరణలపై హైకోర్టు కీలక ఆదేశాలు

రాజదాని మాస్టర్ ప్లాన్ సవరణలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. మాస్టర్ ప్లాన్ సవరణలపై అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలోని 17 గ్రాామాల్లో రెండు రోజుల వ్యవదిలో గ్రామ సభలను నిర్వహించి అభిప్రాయాలను సేకరించాలని తెలిపింది. ఇప్పటి వరకూ మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించగా, మిగిలిన గ్రామాల్లోనూ గ్రామ సభలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా ఆర్ – 5 జోన్ ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జోన్ ఏర్పాటు కోసం సీఆర్డీఏ చట్ట సవరణ చేస్తున్నట్లు పేర్కొంది. ఆర్ – 5 జోన్ పరిధిలోని అయిదు గ్రామాలకు చెందిన 900 ఎకరాలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లో అభ్యంతరాలు సీఆర్డీఏకి తెలియజేయాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చింది. అయితే గ్రామ సభలు నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించింది.

Exit mobile version